20, నవంబర్ 2011, ఆదివారం

కోపం

నన్నయ శతక నీతులు - 2


నన్నయగారి మరో నీతిపద్యం.

ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షితుడు.

ఒకనాడు మృగయాసక్తుడై వేటకు వెళ్లి, ఒక మృగాన్ని బాణంతో కొట్టాడు.

అది పాఱిపోగా, దాన్ని తరుముతూ, మౌనవ్రతుడై తపస్సు చేసుకొంటున్న

శమీకుడనే మునిని చూసి, "నే వేటాడిన మృగం ఈ వైపు వచ్చింది.

అది ఎటు పోయిందో చెప్ప "మన్నాడు. ఆయన మౌనవ్రతుడు కాన పలుకలేదు.

అందుకు పరీక్షితుడు కినిసి, అక్కడ పడియున్న ప్రాణం లేని పామునొకదాన్ని

తన వింటికొప్పుతో ఎత్తి, ఆ ముని మెడలో వేసి, తిరిగి హస్తినాపురానికి వచ్చేశాడు.

ఈ విషయాన్ని కృశుడనే మునివల్ల విన్న శమీకుని పుత్త్రుడు శృంగి అనేవాడు

కోపమూర్ఛాన్వితుడై శాపజలాలెత్తుకొని, " నా తండ్రిని అవమానించిన పరీక్షితుడు

నేడు మొదలు ఏడు రోజుల లోపల తక్షకవిషాగ్నిదగ్ధుడవుతా "డని శాపమిచ్చాడు.

తరువాత తండ్రి వద్దకు వెళ్లి,

ఈ విషయమే తలపక, తపస్సమాధిలో ఉన్న ఆయనను చూచి, సమీపించి,

ముని నుండి ఆ పాముని పారవేసి, కళ్లు తెరిచిన తండ్రికి అభివాదం చేసి,

తాను చేసిన శాపస్థితిని చెప్పాడు. అప్పుడు శమీకుడు, ఎంతో బాధపడి,

ఇలా అన్నాడు.



క్రోధమ తపముం జెఱుచును

గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం

గ్రోధమ ధర్మక్రియలకు

బాధ యగుం; గ్రోధిగా దపస్వికి జన్నే. (ఆదిపర్వం - ద్వితీయాశ్వాసం)



కోపం తపస్సును పాడుచేస్తుంది.

( తపస్సు వల్ల లభించిన ) అణిమ, మహిమ, గరిమ, లఘిమ,

ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం మొదలైన ఐశ్వర్యగుణాలను పోగొడుతుంది.

కోపం ధర్మక్రియలకు బాధ కలిగిస్తుంది. ( అనగా ధర్మకార్యాలను చేయనివ్వదు.)

కోపం గలవాడవడం తపస్వికి తగునా ?


అని పై పద్యం యొక్క భావం.

ఒక్క కోపం ఎంత పని చేస్తుందో చూశారా ?

ఇంకా శమీకుడు అంటాడు.



క్షమ లేని తపసితపమును,

బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్య ప్రభు రా

జ్యము, భిన్నకుంభమున తో

యము లట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.



క్షమాగుణం లేని తపస్వి యొక్క తపస్సు

అజాగ్రత్తపరుడైనవాని సంపద

ధర్మాన్ని విడిచిన రాజు యొక్క రాజ్యం

పగిలిన కుండలోని నీటిలా ఇవన్నీ అస్థిరాలవుతాయి.


అయితే తపస్సు వ్యర్థమయిందని కాదు శమీకుని బాధ.

పరిపాలించే రాజు దైవంతో సమానం.

అటువంటి రాజుకు శాపమివ్వడం తగదని ఆయన బాధపడ్డాడు.

చూశారా! శమీకుని గొప్పతనం.

"రాజు లేకపోతే బాధపడేది ప్రజలే కాదు. మనం కూడా.

మనం నిశ్చింతగా తపస్సు చేసుకొంటున్నామంటే అది రాజు దయవల్లే.

కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకో"మని ఆయన కొడుక్కి ఉపదేశించాడు.



సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, బద్దెన అనే కవి తన సుమతి శతకంలో ఇలా అంటాడు.




తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ ;

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!



మనం మన కోపం ద్వారా ఇతరులను భయపెడుతున్నామనుకొంటాం.

తద్ద్వారా వాణ్ణి జయించామనుకొంటాం.

మనకు కోపం తెప్పించిన వానిని శత్రువుగా భావిస్తాం.

కానీ మనకు కోపం తెప్పించినవాడు కాదు, మన శత్రువు,

మన కోపమే మనకు శత్రువు.

అది మనకు ఎంత కీడు చేస్తుందో శమీకుడు పైన చెప్పాడు కదా!



అయితే ఆ పద్యం తపస్సుకు తపస్వికి సంబంధించిన పద్యంలా ఉంది తప్ప

మనలాంటివారికి కాదేమో అని, మీకో సందేహం రావచ్చు.

కాదు, అది తపస్వులకే కాదు. అందఱికీ సంబంధించినది.

తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకొని అడవిలో కూర్చొని చేసేదే కాదు.

నిత్యజీవితాన్ని గడపడం కూడా తపస్సే.

అయితే అందులో అధర్మానికి తావుండరాదు.

అప్పుడు తపస్వులకు సిద్ధించే అణిమాది సిద్ధులు అందఱికీ లభిస్తాయి.



అణిమ అంటే అణువులా మారడం.

ఇది తపస్సు వల్ల అయితే నిజంగానే సూక్ష్మంగా మారే శక్తి వస్తుంది.

అయితే నిజజీవితంలో అణిమ అనే ఐశ్వర్య శక్తి ఎలా వస్తుందంటే,

గర్వం మనలను విడిచేలా అభ్యాసం చేసి,

పెద్దలైన వారి సమక్షంలో గొప్పవాణ్ణని విర్రవీగకుండా "నేను అణువును"

అని వినయం చూపించినప్పుడు.

ఈ శక్తి రెండవ శక్తిని కలుగజేస్తుంది కూడా. అదే మహిమ.


మహిమ అంటే గొప్పతనం. ఆ వినయమే నలుగురిలో గొప్పతనాన్ని తెస్తుంది.

ఈ గొప్పతనం క్రమంగా మూడవ శక్తి అయిన గరిమను ప్రసాదిస్తుంది.


గరిమ అంటే గురుత్వం. మీరు గురువులవుతారు.

ఈ దశలో ప్రమాదపడకుండా మరల నాల్గవశక్తి అయిన లఘిమను ఆరాధించాలి.


లఘిమ అంటే లఘువు(చిన్న)గా ఉండడం.

ఈ సిద్ధితో ప్రజలనుండి, కుటుంబం నుండి ఐదవ ఐశ్వర్యశక్తి అయిన ప్రాప్తి లభిస్తుంది.


ప్రాప్తి అంటే ఇష్టవస్తువులు ప్రాప్తించడం.

ఇది సంతోషమేగా. దాంతో ఆరవశక్తి ప్రాకామ్యాన్ని పొందుతారు.


ప్రాకామ్యం అంటే ( విచారం లేకుండా ) ఇచ్ఛ వచ్చినట్లు నిర్విఘ్నంగా సంచరించే శక్తి.

అప్పుడు ఏడవశక్తి ఈశత్వాన్ని మీరు ఫీల్ అవుతారు. పొందుతారు కూడా.


ఈశత్వం అంటే అందరినీ అతిశయించగల ప్రభుత్వం.

ఈ అధికారంతో ఎనిమిదవ గుణమైన వశిత్వం లభిస్తుంది.



వశిత్వం అంటే అందరినీ మీ వశంలో ఉంచగలగడం.


ఈ సిద్ధుల్ని అదుపులో పెట్టుకొని ప్రవర్తిస్తే ఇహంలో సుఖంగా బ్రతుకుతారు.

వీటికి లొంగిపోయి, కట్టు తప్పితే ఇహానికి చెడతారు.

ఈ సిద్ధులతో ఆగక వీటిని దాటి, అఖండైశ్వర్యశక్తి అయిన పరమాత్మను ఆరాధిస్తే,

మోక్షగాములవుతారు. పునర్జన్మరహితులవుతారు.


ఇప్పుడు కోపం తపస్వులకే కాదు,

అందఱికీ అణిమాదులైన గుణాలను పోగొడుతుందని అర్థమైంది కదా!

ఇప్పుడు నన్నయ పద్యాన్ని నిజజీవితానికి అన్వయిద్దాం.


తపోజీవితం

కోపం తపస్సును చెడకొడుతుంది.

అణిమాది గుణాలను పోగొడుతుంది.

తపోధర్మక్రియలకు బాధ కలిగిస్తుంది.

కాబట్టి కోపం తపస్వికి తగునా ?


నిజజీవితం

కోపం నిత్యజీవిత విధానాన్ని చెడకొట్టి, నలుగురితో గొడవలు తెస్తుంది.

పైన చెప్పుకొన్న శక్తుల్లో మొదటిదైన వినయాన్ని పోగొడుతుంది.

తద్ద్వారా గొప్పతనం మొదలైన అన్ని శక్తులూ నశిస్తాయి.

నిత్యజీవితంలో ధర్మకార్యాలను చేయనివ్వదు.

అందువల్ల కోపం సంసారులకూ తగదు కదా!


కాబట్టి క్షమాగుణం తపస్వులకూ ఉండాలి. సంసారులకూ ఉండాలి.




అన్నారు సినారె.

క్షమాగుణానికి సంబంధించి, ఓ చందమామ కథ ఉంది.


ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.


పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.


ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.


Shantideva once said "One strong bitter anger can destroy merits of a thousand aeons". There is in fact no merits equivalent to patience and no bad karma equivalent to anger.

The Effects of Anger
1) Visible effects which are felt in this life
2) Invisible effects which will be felt in the next life

1) Visible Effects
Examples of visible effects of anger are feeling unhappy an uneasy, and showing undesirable facial expressions. These will cause others to feel uncomfortable and unwilling to talk to us. Our spirit and physical energy will be deteriorated. We cannot sleep well when we have anger and strong hatred. The next day we will not have a clear mind to concentrate on things. Our diets will be affected, either we do not have to appetite to eat or we will eat a lot. Worse still, it draws all our senses and wisdom such that we become very blunt and bold. Whatever we do, we will not be able to think whether it is right or wrong. We will feel like wanting to scold others and talk bad about others. Eventually, we lose our friends, relatives, health and merits.

2) Invisible Effects
Anger will destroy our goal for practicing and will cause us to be born in hell directly. In Amitabha;s long sutra, it was mentioned that saying bad words with anger and hatred to a Bodhisattva will create evil karma for aeons or destroy our merits accumulated for aeons. This was also mentioned in many other texts. A person who takes and preserves the bodhisattva vows is a bodhisattva. Practitioners of Mahayana and Vajrayana who always think of sentient beings and preserve their vows are bodhisattvas. Therefore one of the most important things to remember is that a bodhisattva can be anyone anywhere. We should not be angry at any person, especially our dharma brothers and sisters." (DHAGPO KAGYU MANDALA వారి సౌజన్యంతో)

అని ఒకరన్నారు.


Anger is a powerful emotion. Uncontrolled anger may cause increased anxiety, high blood pressure and headaches, and trigger fights or abuse.

అని మరొకరన్నారు. ఇంకా వివరిస్తే,

Anger is a powerful emotion. If it isn’t handled appropriately, it may have destructive results for both you and your loved ones. Uncontrolled anger can lead to arguments, physical fights, physical abuse, assault and self-harm. On the other hand, well-managed anger can be a useful emotion that motivates you to make positive changes.

The physical effects

Anger triggers the body’s ‘fight or flight’ response. Other emotions that trigger this response include fear, excitement and anxiety. The adrenal glands flood the body with stress hormones, such as adrenaline and cortisol. The brain shunts blood away from the gut and towards the muscles, in preparation for physical exertion. Heart rate, blood pressure and respiration increase, the body temperature rises and the skin perspires. The mind is sharpened and focused.

Health problems

The constant flood of stress chemicals and associated metabolic changes that accompany recurrent unmanaged anger can eventually cause harm to many different systems of the body. Some of the short and long-term health problems that have been linked to unmanaged anger include:

Headache
Digestion problems, such as abdominal pain
Insomnia
Increased anxiety
Depression
High blood pressure
Skin problems, such as eczema
Heart attack
Stroke. (Better Health Channel వారి సౌజన్యంతో)


16-10-2015 eenadu soujanyamto



మరోసారి మరో పద్యంతో కలుద్దాం.



శుభం భూయాత్.

15, నవంబర్ 2011, మంగళవారం

తనయుడు

నన్నయ శతక నీతులు



వివిధ వేద తత్త్వవేది అయిన వేదవ్యాసుడు,

సంస్కృతభాషలో రచించిన "జయ" అనే ఇతిహాసాన్ని

ఆంధ్రమహాభారతం పేరున తెనిగించి, నన్నయ తెలుగున ఆదికవి అయ్యాడు.

భారతం ద్వారా అనేకానేక విషయాలను తెలుగువారికి అందించి, ధన్యుడయ్యాడు.

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం అని , అధ్యాత్మవిదులు వేదాంతం అని,

నీతివిచక్షణులు నీతిశాస్త్రం అని, కవివృషభులు మహా కావ్యం అని,

లాక్షణికులు ( కావ్యాలకు లక్షణాలను ఏర్పరచువారు ) సర్వలక్ష్యసంగ్రహం అని,

ఐతిహాసికులు ఇతిహాసం అని, పౌరాణికులు బహుపురాణసముచ్చయం అని,

భారతాన్ని కొనియాడడాన్ని బట్టి,

అందులోని విషయసముచ్చయమేమిటో సుబోధమవుతుంది.

ధర్మవిషయాలు, వేదాంతవిషయాలు, నీతులు ఇంకా ఎన్నింటినో

కథారూపంలో అనేక ఉదాహరణలతో భారతం వివరిస్తుంది.

అటువంటి భారతాన్ని తెనుగుచేయ సంకల్పించి, నన్నయ మొదట భారత రచనలో

తాను, కొన్ని కవితాలక్షణాలను పాటిస్తానని తెలియజేశాడు.

ప్రసన్నకథాకలి(వి)తార్థయుక్తి అనే ఒక కవితాలక్షణంతో కవీంద్రుల్ని ,

అక్షరరమ్యత అనే ఇంకో కవితాలక్షణంతో కవీంద్రులు కాని ఇతరుల్ని అలరింపజేస్తానంటూ,

తనను తాను నానారుచిరార్థసూక్తినిధిగా సంభావించుకొన్నాడు.

నానారుచిరార్థసూక్తినిధి అంటే అనేకములైన రుచిరములైన ప్రయోజనం కలిగిన సూక్తులకు నిధి.

సూక్తి అంటే సుభాషితం లేక నీతి.

నన్నయభారతాన్ని పరిశీలిస్తే అడుగడుగునా ఎన్నో నీతులు కనిపించి,

నిజంగానే నన్నయ సూక్తినిధి అనిపిస్తుంది.

లౌకికనీతులు, రాజనీతులు, ఆధ్యాత్మిక ప్రబోధకాలు, లోకజ్ఞతాసూచకాలు

ఇలా ఎన్నో రీతుల నీతులు జీడిపప్పుల్లా నన్నయభారతం అనే తీపివంటకంలో

వెదజల్లబడి, రుచి కలిగిస్తాయి.

వాటిని ఒంటబట్టించుకోవడమే మనం చేయవలసింది.

సూక్తినిధి నన్నయే తెలుగున ఆదికవి అయి ఎన్నో నీతుల్ని రచించాడు కాన

తెలుగు నీతి శతక కర్తలకు కూడా ఆయన మార్గదర్శి అయ్యాడనవచ్చు.

నన్నయ నీతిపద్యాలకు సుమతి వేమనశతకాదిపద్యాలు పూరణగాను, సమర్థకంగానూ,

అనుసరణగానూ ఉన్నాయని తోస్తుంది.

ఉదాహరణకు :


తనయుండు తల్లిదండ్రులు

పనిచిన పని సేయడేని, పలుకెడలో జే

కొనడేని, వాడు తనయుం

డనబడునే ? పితృధనమున కర్హుండగునే ?
(ఆదిపర్వం-తృతీయాశ్వాసం)


యయాతి చరిత్రలో మనకీ నీతి కనబడుతుంది.


తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన పని చేయనివాడు, అసలు వారి మాటే లక్ష్యపెట్టనివాడు

కొడుకనబడతాడా ? పితృధనానికి అర్హుడవుతాడా ? ( పితృధనం అంటే ఆస్తి. )

అని ప్రశ్నలు వేసి, కాదనే జవాబు మనచేత చెప్పిస్తాడు నన్నయ.

నన్నయ మృదుస్వభావి. నీతుల్ని మెత్తగానే చెప్పాడు కానీ, పరుషంగా చెప్పలేదు.

"తనయుడు" అనే పదానికి , వంశమును విస్తరింపచేసేవాడు అని అర్థం.

తల్లిదండ్రుల మాట లెక్కచేయనివాని, వారిని గౌరవించనివాని వంశం వర్థిల్లదు. అని అన్యాపదేశం.

పితృధనం అంటే కేవలం ఆస్తే కాదు. వంశాభివృద్ధికూడా.

ఇక వేమన నన్నయంత మృదుస్వభావి కాదు. అవసరమైతే కర్కశంగా తిట్టగలడు.

తల్లిదండ్రుల యెడ కాఠిన్యం వహించేవాడు తనయుడనబడతాడా?

అనే నన్నయ ప్రశ్నకు కాదు "చెదపురుగు" అనబడతాడు అని సమాధానం చెప్పాడు.

అంతే కాదు పుట్టినా చచ్చినా ఒకటే అన్నాడు.



తల్లిదండ్రిమీద దయలేని పుత్త్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా

విశ్వదాభిరామ! వినుర వేమ!




చెదపురుగుకు పాడుచేయడం తప్ప బాగుచెయ్యడం చేతకాదు.

అమ్మానాన్నలమీద దయలేని కొడుకూ అంతే.

దయ అంటే రక్షించడం. రక్షించే స్వభావాన్నే దయ అంటారు.

కన్నవాళ్లు తమ పిల్లల్ని వారికి ఏమీ తెలియని వయసునుండి, అంటే కన్నక్షణంనుండి

వారి కాళ్లమీద వారు నిలబడేదాకా అనుక్షణం వెన్నంటి కాపాడతారు.

మరి అటువంటి తల్లిదండ్రులను జ్ఞానం వచ్చిన కొడుకు ఎలా చూసుకోవాలి?

తిరిగి ఎంత దయ చూపించాలి?



ఇక్కడ పైన పేర్కొన్న యయాతి కథను పరిశీలిస్తే, దయకు అర్థం బోధపడుతుంది.

యయాతి అనే రాజు శాపవశాత్తు తనకు లభించిన ముసలితనాన్ని తీసుకోమని

తన అయిదుగురు కొడుకులను అడగ్గా,

చివరి కొడుకు పూరుడు మాత్రం అంగీకరిస్తాడు.

మిగిలినవాళ్లు నిర్దయగా ముసలితనాన్ని అనుభవించవలసిందే అంటారు.

సుఖాలన్నీ అనుభవించాక యయాతి తిరిగి పూరునికి యౌవనం తిరిగి ఇవ్వడమే కాక

రాజ్యాన్ని కూడా ఇచ్చి, రాజును చేస్తాడు.

అప్పుడు ప్రజలు, పెద్దకొడుకును కాక చిన్నవాడిని రాజును చేయడం తగునా? అంటే,

పెద్దవాడు నామీద దయలేకుండా దుర్మదుడయ్యాడు.

నా వచనాన్ని ధిక్కరించాడు అంటూ పై నీతి చెప్తాడు.


కాబట్టి, దయ చూపించినవాడే తనయుడు.

దయ చూపించని కొడుకు అన్ని విధాల భ్రష్టుడవుతాడు.

ఇదీ ఇద్దరి కవుల తాత్పర్యం.



ఈ విధంగా నన్నయ నీతులకు శతకనీతులకు పోలిక చూడవచ్చు.

మరో నీతిపద్యంతో మరోసారి కలుద్దాం.



శుభం భూయాత్