7, ఏప్రిల్ 2013, ఆదివారం

రామసుందరం - 11





తం దృష్ట్వా వదనాన్ముక్తం
చంద్రం రాహుముఖా దివ|
అబ్రవీత్ సురసా దేవీ
స్వేన రూపేణ వానరమ్|| 170
రాహు ముఖం నుండి చంద్రునిలా
తన ముఖం నుండి వెలువడిన
కపివరుని చూసి,
సురస నిజ రూపంతో


అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ
గచ్ఛ సౌమ్య యథాసుఖమ్|
సమానయస్వ వైదేహీం
రాఘవేణ మహాత్మనా|| 171


"ఓ సౌమ్య!
రామకార్యసిద్ధికై  సుఖంగా వెళ్ళు.
సీతను రాముని వద్దకు చేర్చు అంది.
తత్ తృతీయం హనుమతో
దృష్ట్వా కర్మ సుదుష్కరమ్|
సాధు సాధ్వితి భూతాని
ప్రశశంసు స్తదా హరిమ్|| 172


హనుమంతు డొనర్చిన
దుష్కరమైన ఈ మూడవ కార్యాన్ని చూసి,
ప్రాణులన్నీ బాగుబాగని ప్రశంసించాయి.
స సాగర మనాధృష్యమ్
అభ్యేత్య వరుణాలయమ్|
జగామాకాశమావిశ్య
వేగేన గరుడోపమ:|| 173
వేగాన గరుడ సమానుడైన ఆ మారుతి, 
సముద్రాన్ని (సురస కారణంగా) సమీపించాడు.
తరువాత ఆకాశ మార్గానికి ఎగిరి,
ప్రయాణం సాగించాడు.


సేవితే వారిధారాభి:
పతగైశ్చ నిషేవితే|
చరితే కైశికాచార్యై:
ఐరావతనిషేవితే|| 174
మేఘాలు విడిచే నీటిధారలతో ఒప్పుతూ,
పక్షులకు ఆటపట్టై,
కైశికాచార్యు*లకు సంచారస్థానమై,
ఐరావతా*నికి నెలవై,


సింహకుంజరశార్దూల
పతగోరగవాహనై:|
విమానైస్సంపతద్భిశ్చ
విమలై స్సమలంకృతే|| 175


సింహాలు, ఏనుగులు, పెద్దపులులు, పక్షులు, సర్పాలు
లాగే విమానాలతో అలంకృతమై,
వజ్రాశనిసమాఘాతై:
పావకైరుపశోభితే|
కృతపుణ్యైర్మహాభాగై:
స్వర్గజిద్భిరలంకృతే|| 176
అశని* ఘాతాలతో,
అగ్నికాంతులతో తేజరిల్లుతూ,
తమ పుణ్యకర్మలతో
స్వర్గాన్ని జయించినవారలతో అలంకృతమై,


వహతా హవ్యమత్యర్థం
సేవితే చిత్రభానునా|
గ్రహనక్షత్రచంద్రార్క
తారాగణవిభూషితే|| 177


హవ్యవాహనునికి మార్గమై,
గ్రహాలు, నక్షత్రాలు, చంద్రసూర్యులు, తారాగణాలతో విభూషితమై,
మహర్షిగణగంధర్వ
నాగయక్షసమాకులే|
వివిక్తే విమలే విశ్వే
విశ్వావసునిషేవితే|| 178
మహర్షులతో,
గంధర్వనాగయక్షులతో కూడి,
విమలమై,
విశ్వావసుడనే గంధర్వునిచే సేవింపబడుతూ,


దేవరాజగజాక్రాంతే
చంద్రసూర్యపథే శివే|
వితానే జీవలోకస్య
వితతే బ్రహ్మనిర్మితే|| 179
ఐరావతానికి క్రీడాస్థానమై,
చంద్రసూర్యులకు దారై,
మంగళకరమై,
జీవలోకానికి బ్రహ్మ నిర్మించిన మేలుకట్టై,


బహుశస్సేవితే వీరై:
విద్యాధరగణైర్వరై:|
జగామ వాయుమార్గే తు
గరుత్మానివ మారుతి:|| 180
వీరులు, విద్యాధరులచే సేవింపబడే,
(గొప్ప) ఆకాశమార్గాన
మారుతి,
గరుత్మంతునిలా సాగిపోతున్నాడు.


హనుమాన్ మేఘజాలాని
ప్రకర్షన్ మారుతో యథా|
కాలాగరుసవర్ణాని
రక్తపీతసితాని చ|| 181  
వాయువులా మేఘాలను చీల్చుకుంటూ పోతున్నాడు.
నలుపు, అగరు, ఎఱుపు, తెలుపు
వన్నెలు గల ఆ మేఘాలు
ఆయనచే ఆకర్షింప బడుతూ ప్రకాశిస్తున్నాయి.


కపినాకృష్యమాణాని
మహాభ్రాణి చకాశిరే|
ప్రవిశ న్నభ్రజాలాని
నిష్పతంశ్చ పున: పున:|
ప్రావృషీందురివాభాతి
నిష్పతన్ ప్రవిశం స్తదా|| 182


మారుతి, మేఘమండలంలో
పదేపదే లోపలికి చొరబడుతూ,
బయటకు వస్తూ,
వర్షాకాలంలో మేఘాల మధ్య సంచరించే
చంద్రునిలా ప్రకాశించాడు.
ప్రదృశ్యమాన స్సర్వత్ర
హనుమాన్ మారుతాత్మజ:|
భేజే౭Oబరం నిరాలంబం
లంబపక్ష ఇవాద్రిరాట్|| 183
నిరాధారమైన ఆ ఆకాశంలో
సర్వత్ర గోచరిస్తూ, ఆయన
ఱెక్కలుగల
ఒక మహాపర్వతంలా తేజరిల్లాడు.


ప్లవమానం తు తం దృష్ట్వా
సింహికా నామ రాక్షసీ|
మనసా చింతయామాస
ప్రవృద్ధా కామరూపిణీ|| 184


సింహిక అనే రాక్షసి,
మారుతిని చూసి,
దేహాన్ని పెంచి,
అద్య దీర్ఘస్య కాలస్య
భవిష్యామ్యహమాశితా
ఇదం హి మే మహత్
సత్త్వం చిరస్య వశమాగతమ్||185
"ఇంతకాలానికి
ఒక మహాజంతువు నాకు లభించబోతోంది.
చాలాకాలం తరువాత
మంచి ఆహారాన్ని తినబోతున్నాను".


ఇతి సంచింత్య మనసా
ఛాయామస్య సమాక్షిపత్|
ఛాయాయాం గృహ్యమాణాయాం
చింతయామాస వానర:|| 186
అనుకొని,
ఆయన ఛాయను ఒడిసి పట్టింది.
తన నీడ లాగబడుతుండగా
హనుమంతుడు,


సమాక్షిప్తో౭స్మి సహసా
పంగూకృతపరాక్రమ:|
ప్రతిలోమేన వాతేన
మహానౌరివ సాగరే|| 187
"సముద్రంలో
ఎదురుగాలికి పయనించే
మహానావలా
నా పరాక్రమం కుంటుబడుతోంది".


తిర్యగూర్ధ్వమధశ్చైవ
వీక్షమాణ స్తత: కపి:
దదర్శ స మహత్ సత్త్వమ్
ఉత్థితం లవణాంభసి|| 188
అనుకొని,
ఆయన, ఈ ప్రక్క, ఆ ప్రక్క, పైన, క్రింద పరికించి,
ముద్రం నుంచి పైకి లేచిన
మహాజంతువును చూశాడు.


తద్దృష్ట్వా చింతయామాస
మారుతి ర్వికృతాననమ్|
కపిరాజేన కథితం
సత్త్వ మద్భుతదర్శనమ్|| 189
ఛాయాగ్రాహి మహావీర్యం
తదిదం నాత్ర సంశయ:|
స తాం బుద్ధ్వార్థతత్త్వేన
సింహికాం మతిమాన్ కపి:|| 190 







కైశికరాగ ప్రవీణులు = తుంబురాదులు


ఐరావతం
దీనికి ౩ అర్థాలు

1. ఇంద్రుని ఏనుగు,

2. వంకఱ లేని నిడుపాటిఇంద్రధనస్సు

౩. మేఘం మీది మేఘం.  
దీన్నే రాజమేఘం అంటారు.


అశని = వజ్రాయుధం
          పిడుగు




శుభం భూయాత్



























దాని వికృతమైన ముఖాన్ని చూచి,
మారుతి,
"ఆశ్చర్యకరం, మహాశక్తిమంతం అయిన
ఈ ఛాయాగ్రాహిని గూర్చే సుగ్రీవుడు చెప్పాడు.
అదే ఇది.
సందేహం లేదు" అనుకొని,
దాన్ని సింహికగా గుర్తించాడు.

2 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

చాలా సంతోషం. రామాయణం చదివినా, విన్నా, రాసినా పుణ్యమే అని పెద్దలు చెప్పిన ప్రమాణం. మీరు మళ్ళీ సుందరకాండ మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు.

నాగస్వరం చెప్పారు...

మనోహర్ గారూ!
మనోహరమైన మీ ప్రోత్సాహం వల్ల
విశ్వప్రయత్నమే చేస్తున్నాను.
సుందరకాండను అనువదించడం,
వాల్మీకి భావాలను అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది.
మీలాంటివారి ఆశీస్సులుంటేనే సాధ్యం.

ధన్యవాదాలు.