భూమీ గృహాంశ్చైత్య గృహాన్
గృహాతిగృహకానపి |
ఉత్పతన్నిష్పతంశ్చాపి
తిష్ఠన్గచ్ఛన్ పునః పునః ||15
|
అన్ని రకాల గృహాల్ని
మళ్లీ మళ్లీ వెదకాడు.
ఆ యా చోట్ల ఎక్కుతూ, దిగుతూ, నిలబడుతూ, ముందుకువెళ్తూ,
|
అపావృణ్వంశ్చ ద్వారాణి
కవాటాన్యవఘాటయన్ |
ప్రవిశన్నిష్పతంశ్చాపి
ప్రపతన్నుత్పతన్నపి ||16
|
తలుపులు తెరుస్తూ,
మూస్తూ,
లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ,
వెదకాడు.
|
సర్వమప్యవకాశం స
విచచార మహాకపిః |
చతురంగుళమాత్రో2పి
నావకాశః స విద్యతే |
రావణాన్తఃపురే తస్మిన్
యం కపిర్న జగామ సః |17
|
ఇలా
హనుమ
వెదకని స్థలం లేదు.
రావణాంతఃపురంలో
ప్రతి అంగుళం
గాలించేశాడు.
|
ప్రాకరాన్తర రథ్యాశ్చ
వేదికాశ్చైత్య సంశ్రయాః |
దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ
సర్వం తేనావలోకితమ్ ||18
|
వీథుల్ని,
కూడళ్లను,
వేదికల్ని,
దిగుడుబావుల్ని, సరస్సుల్ని
పరిశీలించాడు.
|
రాక్షస్యో వివిధాకారా
విరూపా వికృతాస్తథా |
దృష్టా హనుమతా తత్ర
న తు సా జనకాత్మజా ||19
|
వివిధాకారాల
రాక్షసస్త్రీలని
చూశాడు.
జానకి మాత్రం కనబడలేదు.
|
రూపేణాప్రతిమా లోకే
వరా విద్యాధర స్త్రియః |
దృష్టా హనుమతా తత్ర
న తు రాఘవ నన్దినీ ||20
|
విద్యాధరస్త్రీలు
కనిపించారు
కానీ
రాఘవపత్ని కనబడలేదు.
|
నాగ కన్యా వరారోహాః
పూర్ణ చన్ద్ర నిభాననాః |
దృష్టా హనుమతా తత్ర
న తు సీతా సుమధ్యమా ||21
|
నాగకన్యలు
కనిపించారు
కానీ
సీత కనబడలేదు.
|
ప్రమథ్య రాక్షసేన్ద్రేణ
నాగ కన్యా బలాద్ధృతాః |
దృష్టా హనుమతా తత్ర
న సా జనక నన్దినీ ||22
|
నిర్బంధాల్లో ఉన్న
నాగకన్యల్ని చూశాడు
కానీ
జానకి కనబడలేదు.
|
సో2పశ్యంస్తాం మహా బాహుః
పశ్యంశ్చాన్యా వర స్త్రియః |
విషసాద ముహుర్ధీమాన్
హనుమాన్ మారుతాత్మజః ||23
|
ఎందఱో సుందరీమణుల్ని
చూశాడు కానీ
(సీత కనబడకపోవడంతో)
ఎంతో విచారగ్రస్తుడయ్యాడు.
|
ఉద్యోగం వానరేన్ద్రాణం
ప్లవనం సాగరస్య చ |
వ్యర్థం వీక్ష్యానిలసుత
శ్చిన్తాం పునరుపాగమత్ ||24
|
వానరేంద్రుల ప్రయత్నం,
తన సాగరలంఘనం,
వ్యర్థాలైనవికదా అని
చింతించాడు.
|
అవతీర్య విమానాచ్చ
హనుమాన్ మారుతాత్మజః |
చిన్తాముపజగామాథ
శోకోపహత చేతసః ||25
|
హనుమ
విమానం నుండి దిగి,
కలవరపాటుకు గురై,
ఆలోచనలో పడ్డాడు.
|
1, అక్టోబర్ 2017, ఆదివారం
రామసుందరం - పండ్రెండవసర్గం - ద్వితీయభాగం
9, మే 2017, మంగళవారం
రామసుందరం - పండ్రెండవసర్గం - ప్రథమభాగం
సుందరకాండ - ద్వాదశస్సర్గము
స తస్య మధ్యే భవనస్య మారుతి: లతాగృహాంశ్చిత్రగృహాన్ నిశాగృహాన్|
జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో
న చైవ తాం పశ్యతి చారుదర్శనామ్|| 1 ||
|
మారుతి, సీతను
దర్శింపగోరి పట్టుదలతో
రావణుని భవనానికి మధ్యనున్న
లతాగృహాల్ని, చిత్రశాలల్ని,
నిశామందిరాల్ని,
వెదికాడు కాని ఆ చక్కని సీత మాత్రం కనబడలేదు.
|
స చింతయామాస తతో మహాకపి:
ప్రియామపశ్యన్ రఘునందనస్య తామ్|
ధ్రువం న సీతా ధ్రియతే యథా న మే
విచిన్వతో దర్శనమేతి మైథిలీ|| 2 ||
|
రాముని ప్రియపత్నిజానకిని
చూడలేకపోయిన హనుమ, ఇలా
అనుకొన్నాడు.
"ఎంత వెదకినా, మైథిలి కనబడలేదు.
కాబట్టి ఆమె నిశ్చయంగా మరణించి
ఉంటుంది.
|
సా రాక్షసానామ్ ప్రవరేణ జానకీ
స్వశీలసంరక్షణతత్పరా సతీ|
అనేన నూనం ప్రతి దుష్టకర్మణా
హతా భవేదార్యపథే పరే స్థితా|| 3 ||
|
పాతివ్రత్యరక్షణలో ధర్మనిశ్చయం కలదైన
ఉత్కృష్టమైన సజ్జనులమార్గాన్ని స్వీకరించిన,
సీత, రావణుని
కాదన్నందుకు
ఆ దుష్టునిచే తప్పక చంపబడే ఉంటుంది.
|
విరూపరూపా వికృతా వివర్చసో
మహాననా దీర్ఘవిరూపదర్శనా:|
సమీక్ష్య సా రాక్షసరాజయోషితో
భయాద్వినష్టా జనకేశ్వరాత్మజా|| 4 ||
|
రావణయోషితలైన రాక్షసస్త్రీలు విరూపరూపలు.
వికృతలు. తేజోహీనదేహులు. మహాననులు. దీర్ఘవిరూపదర్శనులు.
వారిని చూచి భయంతో
జానకి ప్రాణాలు విడచి ఉంటుంది.
|
సీతా మదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం
విహృత్య కాలమ్ సహ వానరైశ్చిరమ్|
న మే౭స్తి సుగ్రీవసమీపగా గతి:
సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానర:|| 5 ||
|
వానరులతో కలసి, ఇంతకాలం
వెదికాను.
కాని ఆమె కనపడలేదు.
పురుష ప్రయత్నం విఫలమైంది.
ఈ స్థితిలో సుగ్రీవుని వద్దకు వెళ్లరాదు.
వెళ్తే తీక్ష్ణంగా దండిస్తాడు.
|
దృష్టమంత:పురం
సర్వం
దృష్టా రావణయోషిత:|
న సీతా దృశ్యతే సాధ్వీ
వృథా జాతో మమ శ్రమ:|| 6 ||
|
రావణాంతఃపురం సర్వం చూశాను.
రావణకాంతలందఱూ కనబడ్డారు.
సీతాసాధ్వి కనబడలేదు.
నా శ్రమంతా వృథా అయింది.
|
కిం ను మాం వానరాస్సర్వే
గతం వక్ష్యంతి సంగతా:|
గత్వా తత్ర త్వయా వీర
కిం కృతం తద్వదస్వ న:|| 7 ||
|
నేను తిరిగి వెళ్తే వానరులందఱూ
నా చుట్టూ చేరి, ఏమంటారో?
"వీరా! లంకకు వెళ్లి ఏం చేశావు?
మాకు చెప్పు". అంటారు.
|
అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి
తామహం జనకాత్మజామ్|
ధ్రువం ప్రాయముపైష్యంతి
కాలస్య వ్యతివర్తనే|| 8 ||
|
జానకిని చూడకుండా
నేను ఏం సమాధానం ఇవ్వగలను?
సమయం మించిపోతే
వాళ్లు ప్రాయోపవేశం చేస్తారు.
|
కిం వా వక్ష్యతి వృద్ధశ్చ
జాంబవానంగదశ్చ స:|
గతం పారం సముద్రస్య
వానరాశ్చ సమాగతా:|| 9 ||
|
వానరుల్ని కలుసుకొంటే,
జాంబవంతుడు, అంగదుడు,
తక్కినవారు
ఏమంటారో ఏమో?
|
అనిర్వేదశ్శ్రియో మూలమ్
అనిర్వేద: పరం
సుఖమ్|
భూయస్తత్ర విచేష్యామి
న యత్ర విచయ: కృత:||
10 ||
|
వేదన లేకుండా ఉత్సాహంతో ఉంటే,
శ్రేయోసిద్ధి, పరమసుఖం
కల్గుతాయి.
కాబట్టి ఇంతవఱకు వెదకని
ప్రదేశాలన్నీ వెదకుతాను.
|
అనిర్వేదో హి సతతం
సర్వార్థేషు ప్రవర్తక:|
కరోతి సఫలం జంతో:
కర్మ యత్ తత్ కరోతి స:|| 11 ||
|
సర్వార్థాల్లో
అనిర్వేదంగా ఉండటమే శ్రేయస్కరం.
అది పనుల్ని
సఫలం చేస్తుంది.
|
తస్మాదనిర్వేదకృతం
యత్నం చేష్టే౭హముత్తమమ్|
అదృష్టాంశ్చ విచేష్యామి
దేశాన్ రావణపాలితాన్|| 12 ||
|
అందువల్ల దిగులు పడకుండా
గట్టి ప్రయత్నం చేస్తాను.
వెదకని
ప్రదేశాలన్నీ వెదకుతాను.
|
ఆపానశాలా విచితా:
తథా పుష్పగృహాణి చ|
చిత్రశాలాశ్చ విచితా
భూయ: క్రీడాగృహాణి చ| 13 ||
|
పానశాలలు మొదలు
పుష్పగృహాలు,
చిత్రశాలలు,
క్రీడాగృహాలు,
|
నిష్కుటాంతరరథ్యాశ్చ
విమానాని చ సర్వశ:|
ఇతి సంచింత్య భూయో౭పి విచేతుముపచక్రమే|| 14 ||
మంగళం మహత్
|
గృహోద్యానాలు,
అందలి వీథులు, భవనాల్ని
పూర్తిగా గాలించాను.
అయినా మళ్లీ వెదకుతాను"
అని ఆలోచించి, మళ్లీ
వెదకడం ప్రారంభించాడు.
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)