11, మే 2018, శుక్రవారం

రామసుందరం - పదుమూడవసర్గం - ప్రథమభాగం

సుందరకాండ - త్రయోదశస్సర్గము


విమానాత్తు సుసమ్క్రమ్య
ప్రాకారం హరియూథపః |
హనుమాన్వేగవానాసీ
ద్యథా విద్యుద్ఘనాన్తరే ||1
ఆ హనుమంతుడు,
మేఘాల్లో మెఱపులా
విమానంనుండి ప్రాకారానికి
వేగంగా చేరాడు  

సమ్పరిక్రమ్య హనుమా
న్రావణస్య నివేశనాత్ |
అదృష్ట్వా జానకీం సీతా
మబ్రవీద్వచనం కపిః ||2
జానకిని కానక,
రావణగృహంనుండి
కదలి,
ఇలా అనుకొన్నాడు

భూయిష్ఠం లోలితా లఙ్కా
రామస్య చరతా ప్రియమ్ |
న హి పశ్యామి వైదేహీం
సీతాం సర్వాఙ్గశోభనామ్ ||3
రామ హితార్థినై,
లంకంతా గాలించాను
కానీ వైదేహిని
చూడలేకపోయాను

పల్వలాని తటాకాని
సరాంసి సరితస్తథా |
నద్యోఽనూపవనాన్తాశ్చ
దుర్గాశ్చ ధరణీధరాః |
లోలితా వసుధా సర్వా
న తు పశ్యామి జానకీమ్ ||4
అన్ని రకాల జలప్రదేశాలను,
(పల్వలాలు, తటాకాలు, సరస్సులు, సరిత్తులు, నదులు)
జలాలతో ఉన్న వనాలను,
దుర్గమ పర్వతాలను, ఇది అది అనక
(లంకా) భూమంతా తిరిగి, గాలించాను.
జానకి మాత్రం కనబడలేదు 

ఇహ సమ్పాతినా సీతా
రావణస్య నివేశనే |
ఆఖ్యాతా గృధ్రరాజేన
న చ పశ్యామి తామహమ్ ||5
రావణుని లంకలోనే
సీత ఉందని
సంపాతి చెప్పాడు
కానీ ఆమెను చూడలేకపోయాను

కిం ను సీతాఽథ వైదేహీ
మైథిలీ జనకాత్మజా |
ఉపతిష్ఠేత వివశా
రావణం దుష్టచారిణమ్ ||6
వైదేహి, మైథిలి, జానకి అయిన
సీత
రావణునకు
వశమైందా(అయి ఉండదు)

క్షిప్రముత్పతతో మన్యే
సీతామాదాయ రక్షసః |
బిభ్యతో రామబాణానా
మన్తరా పతితా భవేత్ ||7
రామబాణాలకు భయపడి
రావణుడు, సీతను
వేగంగా తెచ్చి ఉండవచ్చు
అపుడు ఆమె మధ్యలోనే పడిపోయిందేమో?

అథవా హ్రియమాణాయాః
పథి సిద్ధనిషేవితే |
మన్యే పతితమార్యాయా
హృదయం ప్రేక్ష్య సాగరమ్ ||8
లేదా ఆకాశమార్గంలో వచ్చేటప్పుడు,
సాగరాన్ని చూసి,
హృదయం భీతిల్లి,
అందులో పడిపోయిందేమో?
 
రావణస్యోరువేగేన
భుజాభ్యాం పీడితేన చ |
తయా మన్యే విశాలాక్ష్యా
త్యక్తం జీవితమార్యయా||9
రావణుని అతివేగంచేతా,
వాని భుజపీడనంచేతా,
సీత,
జీవితాన్ని చాలించి ఉండవచ్చు 

ఉపర్యుపరి వా నూనం
సాగరం క్రమతస్తదా|
వివేష్టమానా పతితా
సాగరే జనకాత్మజా ||10
బాగా పైనుండి
సముద్రాన్ని దాటుతున్నప్పుడు,
జానకి,
సాగరంలో పడిపోయిందేమో?

కామెంట్‌లు లేవు: