14, మే 2018, సోమవారం

రామసుందరం - పదుమూడవసర్గం - చతుర్థభాగం


సుందరకాండ – త్రయోదశస్సర్గము - 4సపుత్రదారాస్సామాత్యా
భర్తృవ్యసనపీడితాః |
శైలాగ్రేభ్యః పతిష్యన్తి
సమేత్య విషమేషు చ ||35

ప్రభు (సుగ్రీవ) వ్యసనపీడితులైన
వానరులు,
దారాపుత్రామాత్యా సమేతులై
శైలాగ్రాలనుండి విషమప్రదేశాల్లో పడిపోతారు
విషముద్బన్ధనం వాపి
ప్రవేశం జ్వలనస్య వా |
ఉపవాసమథో శస్త్రం
ప్రచరిష్యన్తి వానరాః ||36

విషం కాని, ఉరి కాని, అగ్నిప్రవేశం కాని,
ఉపవాసం కాని, శస్త్రం కాని,
ప్రయోగించుకొని,
వారు, ప్రాణాలు విడుస్తారు  
ఘోరమారోదనం మన్యే
గతే మయి భవిష్యతి |
ఇక్ష్వాకుకులనాశశ్చ
నాశశ్చైవ వనౌకసామ్ ||37

నేను వెళ్తే,
ఇక్ష్వాకువంశం అంతరిస్తుంది
వానరకోటి గతిస్తుంది
ఘోర రోదనం మిగుల్తుంది
సోఽహం నైవ గమిష్యామి
కిష్కిన్ధాం నగరీమితః |
న చ శక్ష్యామ్యహం ద్రష్టుం
సుగ్రీవం మైథిలీం వినా ||38

కాబట్టి కిష్కింధకు వెళ్లను గాక వెళ్లను
సీత వినా,
నేను,
సుగ్రీవుని దర్శింపలేను
మయ్యగచ్ఛతి చేహస్థే
ధర్మాత్మానౌ మహారథౌ |
ఆశయా తౌ ధరిష్యేతే
వానరాశ్చ మనస్వినః ||39

నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటే,
రామలక్ష్మణులు,
వానరులు
ఆశతో బ్రతికి ఉంటారు
హస్తాదానో ముఖాదానో
నియతో వృక్షమూలికః |
వానప్రస్థో భవిష్యామి
హ్యదృష్ట్వా జనకాత్మజామ్ ||40
సాగరానూపజే దేశే
బహుమూలఫలోదకే |
చితాం కృత్వా ప్రవేక్ష్యామి
సమిద్ధమరణీసుతమ్ ||41

జానకి కనబడకపోతే,
కందమూలఫలోదకాలు ఎక్కువగా ఉన్న
సాగరతీరప్రదేశాల్లో
వృక్షమూలాల్ని ఆశ్రయించి,
దొరకిన ఆహారాన్ని తింటూ,
నియతుడనై, వానప్రస్థుడనై, ఉండిపోతాను
లేదా చితి కల్పించుకొని,
పవిత్రాగ్నిలో ప్రవేశిస్తాను
ఉపవిష్టస్య వా సమ్య
గ్లిఙ్గినీం సాధయిష్యతః |
శరీరం భక్షయిష్యన్తి
వాయసాః శ్వాపదాని చ ||42

లేదా
ఉపవిష్టుడనై, యోగసాధన ద్వారా,
శరీరాన్ని విడిస్తే,
వాయసమృగాదులు తినగలవు
ఇదం మహర్షిభిర్దృష్టం
నిర్యాణమితి మే మతిః |
సమ్యగాపః ప్రవేక్ష్యామి
న చేత్పశ్యామి జానకీమ్ ||43

లేదా
నీటిలోకి ప్రవేశిస్తాను
ఇట్లా దేహాన్ని త్యజించడం
మహర్షులకు సమ్మతమైనదే
సుజాతమూలా సుభగా
కీర్తిమాలా యశస్వినీ |
ప్రభగ్నా చిరరాత్రీయం
మమ సీతామపశ్యతః ||44

మంగళం మహత్
 

చక్కగా మొదలైనట్టిది, సుందరమైనట్టిది,
కీర్తిమాల, యశస్విని అయిన ఈ దీర్ఘరాత్రి,
సీతను చూడకుండానే
వ్యర్థంగా ముగిసింది.