17, మే 2018, గురువారం

రామసుందరం - పదుమూడవసర్గం - పంచమభాగం



సుందరకాండ – త్రయోదశస్సర్గము - 5


తాపసో వా భవిష్యామి
నియతో వృక్షమూలికః |
నేతః ప్రతిగమిష్యామి
తా మదృష్ట్వాసితేక్షణామ్ ||45

సీతను చూడకుండా
ఇక్కడనుండి వెళ్లను
వృక్షమూలాల్ని ఆశ్రయించి,
నియమాలు పాటిస్తూ, తపస్వినవుతాను
యదీతః ప్రతిగచ్ఛామి
సీతామనధిగమ్య తామ్ |
అఙ్గదస్సహ తైస్సర్వై
ర్వానరైర్న భవిష్యతి ||46

సీతను
చూడకుండా వెళ్తే,
అంగదాది వానరులెవ్వరూ
జీవించరు
వినాశే బహవో దోషా
జీవన్ భద్రాణి పశ్యతి |
తస్మాత్ప్రాణాన్ ధరిష్యామి
ధ్రువో జీవితసఙ్గమః ||47

మరణం వల్ల ఎన్నో దోషాలు కల్గుతాయి
బ్రతికి ఉంటే శ్రేయస్సులు పొందవచ్చు
జీవించి ఉంటే కోరింది తప్పక పొందవచ్చు
అందువల్ల బ్రతికి ఉంటాను
ఏవం బహువిధం దుఃఖం
మనసా ధారయన్ముహుః |
నాధ్యగచ్ఛత్తదా పారం
శోకస్య కపికుఞ్జరః ||48

ఇలా బహువిధాల దుఃఖిస్తూ,
శోకం నుండి
హనుమ
బయటపడలేకపోయాడు
తతో విక్రమమాసాద్య
ధైర్యవాన్ కపికుఞ్జరః |
రావణం వా వధిష్యామి
దశగ్రీవం మహాబలమ్ |
కామమస్తు హృతా సీతా
ప్రత్యాచీర్ణం భవిష్యతి ||49

అనంతరం
ధైర్యవంతుడైన హనుమ
ఇలా అనుకొన్నాడు
సీత సంగతి సరే
ఆమెను తెచ్చిన దశగ్రీవుని వధిస్తాను  
దాంతో ప్రతీకారమైనా తీరుతుంది
అథవైనం సముత్‍క్షిప్య
హ్యుపర్యుపరి సాగరమ్ |
రామాయోపహరిష్యామి
పశుం పశుపతేరివ ||50

లేదా
రావణుని ఎత్తుకొనిపోయి,
పశువును పశుపతికి లాగా,
రామునికి సమర్పిస్తాను
ఇతి చిన్తాం సమాపన్నః
సీతామనధిగమ్య తామ్ |
ధ్యానశోకపరీతాత్మా
చిన్తయామాస వానరః ||51

ఇలా ఎన్నో ఆలోచనల్లో మునిగిన
హనుమ,
సీత  కనబడకపోవడంతో శోకాత్ముడై,
మళ్ళీ ఇలా ఆలోచించాడు
యావత్సీతాం హి పశ్యామి
రామపత్నీం యశస్వినీమ్ |
తావదేతాం పురీం లఙ్కాం
విచినోమి పునః పునః ||52

రామపత్ని
కనబడేదాకా
లంకను
మళ్లీ మళ్లీ గాలిస్తాను
సమ్పాతివచనాచ్చాపి
రామం యద్యానయామ్యహమ్ |
అపశ్యన్ రాఘవో భార్యాం
నిర్దహేత్సర్వవానరాన్ ||53

సంపాతి చెప్పాడు కదా అని
రాముని ఇక్కడకు తీసుకొని వస్తే,
భార్యను కానక, ఆయన,
వానరులందఱ్నీ దహిస్తాడు
ఇహైవ నియతాహారో
వత్స్యామి నియతేన్ద్రియః |
న మత్కృతే వినశ్యేయుః
సర్వే తే నరవానరాః ||54

మంగళం మహత్
 

కాబట్టి నియతాహారంతో
జితేంద్రియుడ్నై ఇక్కడే నివసిస్తాను
నా నిమిత్తమై
నరవానరులు నశించరాదు

కామెంట్‌లు లేవు: