18, మే 2018, శుక్రవారం

రామసుందరం - పదుమూడవసర్గం - షష్ఠభాగం


సుందరకాండ – త్రయోదశస్సర్గము – 6



అశోకవనికా చేయం
దృశ్యతే యా మహాద్రుమా |
ఇమామధిగమిష్యామి
న హీయం విచితా మయా ||55

మహావృక్షాలతో ఎదురుగా కనబడుతున్న
ఈ అశోకవనాన్ని,
చేరుకుంటాను
దీన్ని ఇంతవఱకు వెదుకలేదు
వసూన్రుద్రాంస్తథాఽదిత్యా
నశ్వినౌ మరుతోఽపి చ |
నమస్కృత్వా గమిష్యామి
రక్షసాం శోకవర్ధనః ||56

వసువులకు, రుద్రులకు, ఆదిత్యులకు,
ఆశ్వినీదేవతలకు, మరుత్తులకు నమస్కరించి,
రాక్షసులకు శోకవర్ధనుడనై,
ఈ అశోకవనంలోకి అడుగుపెడతాను
జిత్వా తు రాక్షసాన్ సర్వా
నిక్ష్వాకుకులనన్దినీమ్ |
సమ్ప్రదాస్యామి రామాయ
యథా సిద్ధిం తపస్వినే ||57

రాక్షసులందఱ్నీ జయించి,
ఇక్ష్వాకుకులనందిని సీతను,
తపస్వికి సిద్ధిలా,
రామునికి సమర్పిస్తాను
సః ముహూర్తమివ ధ్యాత్వా
చిన్తావగ్రథితేన్ద్రియః |
ఉదతిష్ఠన్మహాతేజా
హనుమాన్ మారుతాత్మజః ||58

చింతా వ్యాకులుడై,
ముహూర్తకాలం
హనుమ, ధ్యానమగ్నుడయ్యాడు
అనంతరం లేచాడు
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః ||59

రామునకు లక్ష్మణునకు
జనకసుతకు నమస్కారం
రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయువునకు నమస్కారాలు
చంద్రార్కులకు మరుద్దేవతలకు నమస్కారాలు

స తేభ్యస్తు నమస్కృత్య
సుగ్రీవాయ చ మారుతిః |
దిశస్సర్వాస్సమాలోక్య
హ్యశోకవనికాం ప్రతి ||60

వారితో పాటు సుగ్రీవునకును నమస్కరించి,
మారుతి
అశోకవనాన్ని గూర్చిన
అన్ని దిక్కుల్ని ఆలోకించాడు

స గత్వా మనసా పూర్వ
మశోకవనికాం శుభామ్ |
ఉత్తరం చిన్తయామాస
వానరో మారుతాత్మజః ||61

అశోకవనంలోకి
తన మనస్సును నిలిపి,
కర్తవ్యం
ఆలోచించాడు

ధ్రువం తు రక్షోబహులా
భవిష్యతి వనాకులా |
అశోకవనికా చిన్త్యా
సర్వసంస్కారసంస్కృతా ||62

సర్వసంస్కారసంస్కృతమైనది,
ధ్రువంగా వృక్షరాక్షసులతో నిండి ఉన్న
అశోకవనాన్ని
తప్పక చూడాలి
రక్షిణశ్చాత్ర విహితా
నూనం రక్షన్తి పాదపాన్ |
భగవానపి సర్వాత్మా
నాతిక్షోభం ప్రవాతి వై ||63

వనరక్షణకై రక్షకులు ఉండే ఉంటారు
వాయుదేవుడు కూడా
మితవేగంతో
వీస్తున్నాడు
సంక్షిప్తోఽయం మయాఽత్మా చ
రామార్థే రావణస్య చ |
సిద్ధిం మే సంవిధాస్యన్తి
దేవాః సర్షిగణా స్త్విహ ||64

రాముని(కి, ఫలసిద్ధి),
రావణుని(కి,కనబడకుండుట) కోసం
సూక్ష్మరూపాన్ని ధరించాను
దేవాః సర్షిగణాలు సిద్ధి కూర్చెదరు గాక!
బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్
దేవాశ్చైవ దిశన్తు మే |
సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ
పురుహూతశ్చ వజ్రభృత్ ||65

స్వయంభువైన బ్రహ్మ,
ఇతరదేవతలు,
అగ్ని, వాయువు,
వజ్రాయుధుడైన ఇంద్రుడు,
వరుణః పాశహస్తశ్చ
సోమాదిత్యౌ తథైవ చ |
అశ్వినౌ చ మహాత్మానౌ
మరుతః శర్వ ఏవ చ ||66

పాశహస్తుడైన వరుణుడు,
సూర్యచంద్రులు,
మహాత్ములు అశ్వినీదేవతలు,
మరుత్తులు, శివుడు,
సిద్ధిం సర్వాణి భూతాని
భూతానాం చైవ యః ప్రభుః |
దాస్యన్తి మమ యే చాన్యే
హ్యదృష్టాః పథి గోచరాః ||67

సమస్తభూతాలు,
సర్వజీవులకు ప్రభువైన విష్ణువు,
ఇంకా నా దృష్టికి గోచరించని, ఇతరదేవతలును
నాకు సిద్ధిని కల్గించెదరు గాక!
తదున్నసం పాణ్డురదన్త మవ్రణం
శుచిస్మితం పద్మపలాశలోచనమ్ |
ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం
ప్రసన్నతారాధిపతుల్యదర్శనమ్ ||68
ఎత్తైన నాసికతో, తెల్లని పలువరుసతో నిర్మలమైన చిఱునవ్వుతో,
తామరఱేకుల కన్నులతో, చంద్రునిలా ప్రసన్నమనోహరంగా
ఉంటుందని రాముడు చెప్పిన
సీతమోమును నేనెప్పుడు చూస్తానో!?

క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా
సుదారుణాలఙ్కృతవేషధారిణా |
బలాభిభూతా హ్యబలా తపస్వినీ
కథం ను మే దృష్టిపథేఽద్య సా భవేత్ ||69
క్షుద్రుడు, పాపి, నృశంసకర్ముడు,
సుదారుణాలంకృతవేషధారుడు,
అయిన రావణునిచే బలాభిభూతయైన
అబల, తపస్విని సీతను ఎలా చూడగలనో!?



మంగళం మహత్
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సున్దరకాణ్డే త్రయోదశస్సర్గః |

ఇక ఈ సుందరకాండను, భక్తశిఖామణులు https://www.satatam.blogspot.com అనే నా ఇంకో బ్లాగ్ లో చూడగలరు. 
కృతజ్ఞతలతో 
భవదీయుడు.

కామెంట్‌లు లేవు: