12, మే 2018, శనివారం

రామసుందరం - పదుమూడవసర్గం - ద్వితీయభాగం


సుందరకాండ – త్రయోదశస్సర్గము - 2



అహో క్షుద్రేణ వాఽనేన
రక్షన్తీ శీలమాత్మనః |
అబన్ధుర్భక్షితా సీతా
రావణేన తపస్వినీ ||11
నిస్సహాయురాలైన,
తన శీలాన్ని రక్షించుకొంటున్న,
సాధుశీల సీత,
రావణునిచే భక్షింపబడి ఉంటుంది

అథవా రాక్షసేన్ద్రస్య
పత్నీభిరసితేక్షణా |
అదుష్టా దుష్టభావాభి
ర్భక్షితా సా భవిష్యతి ||12
లేదా
అసితేక్షణైన ఆమెను
రావణుని భార్యలు
భక్షించారేమో?

సమ్పూర్ణచన్ద్రప్రతిమం
పద్మపత్రనిభేక్షణమ్ |
రామస్య ధ్యాయతీ వక్త్రం
పఞ్చత్వం కృపణా గతా ||13
తామరసనేత్రాలు కల్గి,
పూర్ణచంద్రసమానమైన
రాముని ముఖాన్నే ధ్యానిస్తూ,
దీనురాలై అసువులు వీడిందేమో?

హా రామ లక్ష్మణేత్యేవం
హాఽయోధ్యే చేతి మైథిలీ |
విలప్య బహు వైదేహీ
న్యస్తదేహా భవిష్యతి ||14
హా రామా! లక్ష్మణా! అయోధ్యా!
అని పెక్కు విధాల
విలపించి,
తనువు చాలించిందేమో?

అథవా నిహితా మన్యే
రావణస్య నివేశనే |
నూనం లాలప్యతే సీతా
పఞ్జరస్థేవ శారికా ||15
లేదా
రావణుని ఇంటనే
పంజరంలో గోరువంకలా
విలపిస్తోందేమో?

జనకస్య సుతా సీతా
రామపత్నీ సుమధ్యమా |
కథముత్పలపత్రాక్షీ
రావణస్య వశం వ్రజేత్ ||16
జానకి, సుమధ్యమ, ఉత్పలపత్రాక్షి,
రామపత్ని అయిన సీత,
రావణునికి
ఎలా వశమవుతుంది? (కాదు)

వినష్టా వా ప్రణష్టా వా
మృతా వా జనకాత్మజా |
రామస్య ప్రియభార్యస్య
న నివేదయితుం క్షమమ్ ||17
భార్య అంటే ప్రియం గల రామునికి,
ఆమె, వినష్టనో, ప్రణష్టనో, జీవించిలేదనో
నివేదించడం
యుక్తం కాదు

నివేద్యమానే దోషస్స్యా
ద్దోషస్స్యాదనివేదనే |
కథం ను ఖలు కర్తవ్యం
విషమం ప్రతిభాతి మే ||18
అయితే నివేదించినా దోషమే
నివేదించకపోయినా దోషమే
ఏం చేయాలి?
విషమసమస్యలా ఉంది

అస్మిన్నేవంగతే కార్యే
ప్రాప్తకాలం క్షమం చ కిమ్ |
భవేదితి మతం భూయో
హనుమాన్ప్రవిచారయత్ ||19
మఱి ఇప్పుడు
చేయవలసింది ఏది?
అని హనుమ మళ్లీ
కర్తవ్యాన్ని ఆలోచించాడు

యది సీతామదృష్ట్వాఽహం
వానరేన్ద్రపురీమితః |
గమిష్యామి తతః కో మే
పురుషార్థో భవిష్యతి ||20
సీతను చూడకుండా,
కిష్కింధకు వెళ్తే,
ప్రయోజనం
ఏమిటి?

మమేదం లఙ్ఘనం వ్యర్థం
సాగరస్య భవిష్యతి |
ప్రవేశశ్చైవ లఙ్కాయాః
రాక్షసానాం చ దర్శనమ్ ||21
(అలా వెళ్తే) సముద్ర లఙ్ఘనం,
లంకాప్రవేశం,
రాక్షసుల్ని చూడ్డం,
అంతా వ్యర్థమే

కిం మాం వక్ష్యతి సుగ్రీవో
హరయో వా సమాగతాః |
కిష్కిన్ధాం సమనుప్రాప్తం
తౌ వా దశరథాత్మజౌ ||22

మంగళం మహత్
ఈ స్థితిలో కిష్కింధకు వెళ్తే,
సుగ్రీవుడేమంటాడో?
వానరులేమంటారో?
ఆ దశరథాత్మజులేమంటారో?


కామెంట్‌లు లేవు: