సుందరకాండ - దశమస్సర్గము
తత్ర దివ్యోపమం ముఖ్యం
స్ఫాటికం రత్నభూషితమ్ |
అవేక్షమాణో హనుమాన్
దదర్శ శయనాసనమ్ || 1
||
|
హనుమంతుడు
ఆ భవనంలో
ఒక శయనాసనాన్ని (తల్పాన్ని)
చూశాడు.
|
దాంతకాంచనచిత్రాంగై:
వైడూర్యైశ్చ వరాసనై: |
మహార్హాస్తరణోపేతై:
ఉపపన్నం మహాధనై: || 2 ||
|
మేలైన
ఆసనాలు కల్గి,
దేవలోకంలోని
శయనాసనంలా
ఉందది.
|
తస్య చైకతమే దేశే
దివ్యమాలావిభూషితమ్ |
దదర్శ పాండురం ఛత్రం
తారాధిపతిసన్నిభమ్ || 3 ||
|
ఆ
శయనాసనానికి
ఊర్ధ్వభాగంలో
తెల్లని
ఛత్రాన్ని
చూశాడు.
|
జాతరూపపరిక్షిప్తం
చిత్రభానుసమప్రభమ్ |
అశోకమాలావితతం
దదర్శ పరమాసనమ్ || 4 ||
|
అశోకమాలలతో
కూడిన
ఆ
ఆసనం
సూర్యకాంతి
సమానమైనది.
|
వాలవ్యజనహస్తాభి:
వీజ్యమానం సమంతత: |
గంధైశ్చ వివిధైర్జుష్టం
వరధూపేన ధూపితమ్ || 5 ||
|
అన్ని
దిక్కులకూ
సుగంధభరితమైన గాలి తగిలేలా
కొందఱు
స్త్రీలు
చామరాలతో
విసరుతున్నారు.
|
పరమాస్తరణాస్తీర్ణమ్
ఆవికాజినసంవృతమ్ |
దామభిర్వరమాల్యానాం
సమంతాదుపశోభితమ్ || 6 ||
|
మేలైన
ఆస్తరణాలు,
ఉన్నికంబళ్లు,
సుగంధపుష్పమాలికలతో
శోభిల్లుతున్న
|
తస్మిన్ జీమూతసంకాశం
ప్రదీప్తోత్తమకుండలమ్ |
లోహితాక్షం మహాబాహుమ్
మహారజతవాససమ్ || 7 ||
లోహితేనానులిప్తాంగం
చందనేన సుగంధినా |
సంధ్యారక్తమివాకాశే
తోయదం సతటిద్గణమ్ || 8
||
|
ఆ
తల్పంపై నిద్రిస్తున్న రావణుని
హనుమంతుడు
చూశాడు.
ఆతడు
నల్లని మేఘంలా ఉన్నాడు.
కర్ణకుండలాలు
మెరుస్తున్నాయి.
శరీరంపై ఎఱ్ఱచందనం పూయబడిఉంది.
ఆభరణాలు ధగధగ మెరుస్తున్నాయి.
మెరుపులతో కూడిన
మేఘంలా ఉన్నాడు.
|
వృతమాభరణైర్దివ్యై:
సురూపం కామరూపిణమ్ |
సవృక్షవనగుల్మాఢ్యం
ప్రసుప్తమివ మందరమ్ || 9 ||
|
మందరపర్వతం
నిద్రిస్తున్నట్లు
నిశ్చలంగా
ఉన్నాడు.
|
క్రీడిత్వోపరతం రాత్రౌ
వరాభరణభూషితమ్ |
ప్రియం రాక్షసకన్యానాం
రాక్షసానాం సుఖావహమ్ || 10 ||
|
రాక్షసులకు
రాక్షసకన్యలకు
సుఖప్రియాలు
కల్గించే
|
పీత్వాప్యుపరతం చాపి
దదర్శ స మహాకపి: |
భాస్వరే శయనే వీరం
ప్రసుప్తం రాక్షసాధిపమ్ || 11 ||
|
ఆ
రావణుడు త్రాగి,
ఉపరతుడై,
గాఢంగా
నిద్రిస్తున్నాడు.
|
నిశ్శ్వసంతం యథా నాగం
రావణం వానరర్షభ: |
ఆసాద్య పరమోద్విగ్న:
సోపాసర్పత్ సుభీతవత్ || 12 ||
|
నాగం(పాము/ఏనుగు)లా
నిశ్శ్వాసాలు
విడుస్తున్న రావణుని
హనుమంతుడు
సమీపించి,
ఉద్విగ్నుడై,
దూరం జరిగాడు.
|
అథారోహణమాసాద్య
వేదికాంతరమాశ్రిత: |
సుప్తం రాక్షసశార్దూలమ్
ప్రేక్షతే స్మ మహాకపి: || 13 ||
|
సోపానమార్గంలో
మఱొక
వేదిక మీద కూర్చొని,
రావణుని
మీదికి
దృష్టి
సారించాడు.
|
శుశుభే రాక్షసేంద్రస్య
స్వపతశ్శయనోత్తమమ్ |
గంధహస్తిని సంవిష్టే
యథా ప్రస్రవణం మహత్ || 14 ||
|
ఆ
మహాతల్పం సెలయేఱులా ఉంది.
నిద్రిస్తున్న
రావణుడందులోకి ప్రవేశించిన
మదగజంలా ఉన్నాడు.
(
సెలయేఱులోకి మదగజం ప్రవేశించగానే,
మిగిలిన
మగఏనుగులు భయపడి పారిపోతాయి.
ఆడఏనుగులు మాత్రమే అక్కడ ఉంటాయి.)
|
కాంచనాంగదసన్నద్ధౌ
దదర్శ స మహాత్మన: |
విక్షిప్తౌ రాక్షసేంద్రస్య
భుజావింద్రధ్వజోపమౌ || 15 ||
|
బంగారు
భుజకీర్తులతో
ఇంద్రధ్వజసమానమైన
రావణుని
చాచిన
బాహువులను చూశాడు.
|
ఐరావతవిషాణాగ్రై:
ఆపీడనకృతవ్రణౌ |
వజ్రోల్లిఖితపీనాంసౌ
విష్ణుచక్రపరిక్షతౌ || 16 ||
|
ఆ
బాహువులపై
ఐరావతం
కోరలవల్ల, వజ్రాయుధంవల్ల,
విష్ణుచక్రంవల్ల
ఏర్పడిన
గాయాల
గుర్తులు కనబడుతున్నాయి.
|
పీనౌ సమసుజాతాంసౌ
సంగతౌ బలసంయుతౌ |
సులక్షణనఖాంగుష్ఠౌ
స్వంగుళీతలలక్షితౌ || 17 ||
|
అవి బలంతో బాగా బలసి,
ఇనుపగుదియల్లా,
ఏనుగుతొండాల్లా
గుండ్రంగా
ఉన్నాయి.
|
సంహతౌ పరిఘాకారౌ
వృత్తౌ కరికరోపమౌ |
విక్షిప్తౌ శయనే శుభ్రే
పంచశీర్షావివోరగౌ || 18 ||
|
ఆ
తల్పంపై
చాచబడిన
ఆ బాహువులు
ఐదుపడగల
సర్పాల్లా
ఉన్నాయి.
|
శశక్షతజకల్పేన
సుశీతేన సుగంధినా |
చందనేన పరార్ధ్యేన
స్వనులిప్తౌ స్వలంకృతౌ || 19 ||
|
ఎఱ్ఱని,
చల్లని
చందనాలు
ఆ
బాహువులపై
పూయబడి
ఉన్నాయి.
|
ఉత్తమస్త్రీవిమృదితౌ
గంధోత్తమనిషేవితౌ |
యక్షకిన్నరగంధర్వ
దేవదానవరావిణౌ || 20 ||
|
స్త్రీలచే
పిసుకబడే,
దేవదానవాదులను
బాధించే
ఆ
బాహువులు
|
దదర్శ స కపిస్తస్య
బాహూ శయనసంస్థితౌ |
మందరస్యాంతరే సుప్తౌ
మహాహీ రుషితావివ || 21 ||
|
మందరగిరిగుహలో
నిద్రిస్తున్న
క్రుద్ధభుజంగాల్లా
ఉన్నాయి.
|
తాభ్యాం స పరిపూర్ణాభ్యాం
భుజాభ్యాం రాక్షసేశ్వర: |
శుశుభే౭చలసంకాశ:
శృంగాభ్యామివ మందర: || 22 ||
|
పరిపూర్ణమైన ఆ భుజాలతో
రావణుడు
శిఖరాలతో కూడిన
మందరగిరిలా ఉన్నాడు.
|
చూతపున్నాగసురభి:
వకుళోత్తమసంయుత: |
మృష్టాన్నరససంయుక్త:
పానగంధపురస్సర: || 23 ||
|
ఆతని
నిట్టూర్పులు
అన్నరసగంధాలను
(
మామిడి, పున్నాగ
మృష్టాన్నరసపానాది గంధాలు)
|
తస్య రాక్షససింహస్య
నిశ్చక్రామ మహాముఖాత్ |
శయానస్య వినిశ్శ్వాస:
పూరయన్నివ తద్గృహమ్ || 24 ||
|
మందిరాన్ని
నింపుతున్నవో
అన్నట్లుగా
వెదజల్లుతున్నాయి.
|
ముక్తామణివిచిత్రేణ
కాంచనేన విరాజితమ్ |
ముకుటేనాపవృత్తేన
కుండలోజ్జ్వలితాననమ్ || 25 ||
|
ఆ
రావణుడు,
కొంచెం
ఒరిగిన
సువర్ణకిరీటం,
మనోహరమైన
ముఖం
|
రక్తచందనదిగ్ధేన
తథా హారేణ శోభినా |
పీనాయతవిశాలేన
వక్షసా౭భివిరాజితమ్ || 26 ||
|
విశాల
వక్షఃస్థలం
|
పాండురేణాపవిద్ధేన
క్షౌమేణ క్షతజేక్షణమ్ |
మహార్హేణ సుసంవీతం
పీతేనోత్తమవాససా || 27 ||
|
పీతవస్త్రాలు
కల్గి
|
మాషరాశిప్రతీకాశం
నిశ్శ్వసంతం భుజంగవత్ |
గాంగే మహతి తోయాంతే
ప్రసుప్తమివ కుంజరమ్ || 28 ||
|
మినుములరాశిలాగున్నాడు.
మహాసర్పంలా
నిట్టూర్పులు విడుస్తున్నాడు.
గంగాజలాలమధ్య
నిద్రిస్తున్న
ఏనుగులా ఉన్నాడు.
|
చతుర్భి: కాంచనైర్దీపై:
దీప్యమానచతుర్దిశమ్ |
ప్రకాశీకృతసర్వాంగం
మేఘం విద్యుద్గణైరివ || 29 ||
|
కాంచనదీపపుకాంతులమధ్య
ఆతడు
విద్యుద్గణాలమధ్య
మేఘంలా
ఉన్నాడు.
|
పాదమూలగతాశ్చాపి
దదర్శ సుమహాత్మన: |
పత్నీ స్స ప్రియభార్యస్య
తస్య రక్ష:పతేర్గృహే
|| 30 ||
|
అలాంటి
రావణుని,
ఆతని
పాదాలచెంత ఉన్న
ఆతని
భార్యలందఱ్నీ
హనుమంతుడు
చూశాడు.
|
శశిప్రకాశవదనా:
చారుకుండలభూషితా: |
అమ్లానమాల్యాభరణా
దదర్శ హరియూథప: || 31 ||
|
ఆ
రావణపత్నులందఱూ
సహజంగానూ,
అలంకరణలతోనూ
అందంగా
ఉన్నారు.
|
నృత్తవాదిత్రకుశలా
రాక్షసేంద్రభుజాంకగా: |
వరాభరణధారిణ్యో
నిషణ్ణా దదృశే హరి: || 32 ||
|
నృత్యవాద్యకళావిశారదులు
వారు.
రావణుని
భుజాలపైన
ఒడిలోను
నిద్రిస్తున్నారు.
|
వజ్రవైడూర్యగర్భాణి
శ్రవణాంతేషు యోషితామ్ |
దదర్శ తాపనీయాని
కుండలాన్యంగదాని చ || 33 ||
|
వారి
కుండలాలు,
దండకడియాలు
చూశాడు.
|
తాసాం చంద్రోపమైర్వక్త్రై:
శుభైర్లలితకుండలై: |
విరరాజ విమానం తత్
నభస్తారాగణైరివ || 34 ||
|
వారికాంతులతో
ఆ
విమానం
నక్షత్రాలకాంతితో
వెలిగే
ఆకాశంలా ఉంది.
|
మదవ్యాయామఖిన్నాస్తా
రాక్షసేంద్రస్య యోషిత: |
తేషు తేష్వవకాశేషు
ప్రసుప్తా: తనుమధ్యమా:
|| 35 ||
|
మదవ్యాయామంలో
అలసి,
గాఢనిద్రలో
మునిగిపోయారు.
|
అంగహారైస్తథైవాన్యా
కోమలైర్నృత్తశాలినీ |
విన్యస్తశుభసర్వాంగీ
ప్రసుప్తా వరవర్ణినీ || 36 ||
|
నృత్యనేర్పరి
అయిన
ఒక
శుభాంగి
నృత్యభంగిమలతోనే
నిద్రిస్తోంది.
|
కాచిద్వీణాం పరిష్వజ్య
ప్రసుప్తా సంప్రకాశతే |
మహానదీప్రకీర్ణేవ
నళినీ పోతమాశ్రితా || 37 ||
|
మహానదీప్రవాహంలో
నావను
ఆశ్రయించిన పద్మలతలా
ఒక
లతాంగి
వీణను
కౌగిలించుకొని నిద్రిస్తోంది.
|
అన్యా కక్షగతేనైవ
మడ్డుకేనాసితేక్షణా |
ప్రసుప్తా భామినీ భాతి
బాలపుత్రేవ వత్సలా || 38 ||
|
మడ్డుకం
అనే ఒక చర్మవాద్యాన్ని
చంకలో
ఉంచుకొని నిద్రిస్తున్న
ఒక
తరుణి
చంకలో
పిల్లాడు కలిగిన ఇంతిలా ఉంది.
|
పటహం చారుసర్వాంగీ
పీడ్య శేతే శుభస్తనీ |
చిరస్య రమణం లబ్ధ్వా
పరిష్వజ్యేవ భామినీ || 39 ||
|
ప్రియుని
కౌగిలించుకొన్న పడతిలా
ఒక
సుందరి
పటహం
అనే చర్మవాద్యాన్ని
వక్షఃస్థలానికి
అదుముకొని నిద్రిస్తోంది.
|
కాచిద్వంశం పరిష్వజ్య
సుప్తా కమలలోచనా |
రహ: ప్రియతమం గృహ్య
సకామేవ చ కామినీ || 40 ||
|
తమకంతో
ప్రియుని కౌగిలించుకొన్న
కామినిలా
ఒక భామిని
వేణువును
హృదయానికి
హత్తుకొని నిద్రిస్తోంది.
|
విపంచీం పరిగృహ్యాన్యా
నియతా నృత్తశాలినీ |
నిద్రావశమనుప్రాప్తా
సహకాంతేవ భామినీ || 41 ||
|
ఒక
రమణి
విపంచిని
ఎదపై
చేర్చుకొని,
నిద్రిస్తోంది.
|
అన్యా కనకసంకాశై:
మృదుపీనైర్మనోరమై: |
మృదంగం పరిపీడ్యాంగై:
ప్రసుప్తా మత్తలోచనా || 42 ||
|
మృదంగాన్ని
కౌగిలించుకొని
ఒక
ముదిత,
నిద్రిస్తోంది.
|
భుజపార్శ్వాంతరస్థేన
కక్షగేణ కృశోదరీ |
పణవేన సహానింద్యా
సుప్తా మదకృతశ్రమా || 43 ||
|
చంకలో
పణవంతో
ఒక
జాణ
నిద్రిస్తోంది.
|
డిండిమం పరిగృహ్యాన్యా
తథైవాసక్తడిండిమా |
ప్రసుప్తా తరుణం వత్సమ్
ఉపగుహ్యేన భామినీ || 44 ||
|
డిండిమ
వాద్యాన్ని
గ్రహించి
ఒక
నెలత,
నిద్రిస్తోంది.
|
కాచిదాడంబరం నారీ
భుజసంయోగపీడితమ్ |
కృత్వా కమలపత్రాక్షీ
ప్రసుప్తా మదమోహితా || 45 ||
|
ఆడంబరం
అనే తూర్యవాద్యాన్ని
హత్తుకొని
ఒక
అతివ
నిద్రిస్తోంది.
|
కలశీమపవిధ్యాన్యా
ప్రసుప్తా భాతి భామినీ |
వసంతే పుష్పశబలా
మాలేవ పరిమార్జితా || 46 ||
|
గాఢనిద్రలో
తెలియక
ఒక
కలకంఠి కలశాన్ని తోసింది.
దాంతో
అందులోని గంధోదకంతో ఆవిడ తడిసిపోయింది.
అపుడామె
వాడిపోకుండా నీటితో తడిపిన
విచిత్రవర్ణపుష్పలతలా
ఉంది.
|
పాణిభ్యాం చ కుచౌ కాచిత్
సువర్ణకలశోపమౌ |
ఉపగుహ్యాబలా సుప్తా
నిద్రాబలపరాజితా || 47 ||
|
ఒక
అబల
తన
బంగారుకలశాలను
చేతులతో
కప్పుకొని
నిద్రిస్తోంది.
|
అన్యా కమలపత్రాక్షీ
పూర్ణేందుసదృశాననా |
అన్యామాలింగ్య సుశ్రోణీం
ప్రసుప్తా మదవిహ్వలా || 48 ||
|
ఒక
రమణి
మఱొక
రామను
మదవిహ్వలయై
కౌగిలించుకొని
నిద్రిస్తోంది.
|
ఆతోద్యాని విచిత్రాణి
పరిష్వజ్య వరస్త్రియ: |
నిపీడ్య చ కుచైస్సుప్తా:
కామిన్య: కాముకానివ
|| 49 ||
|
అక్కడి
స్త్రీలు
చిత్రవిచిత్రచతుర్విధవాద్యాలను
హృదయాలకు
హత్తుకొని
నిద్రిస్తున్నారు.
|
తాసామేకాంతవిన్యస్తే
శయానాం శయనే శుభే |
దదర్శ రూపసంపన్నామ్
అపరాం స కపి: స్త్రియమ్
|| 50 ||
|
ఆ
కాంతల్లో
మిక్కిలి
అందమైన ఒక స్త్రీ
ప్రత్యేకశయ్యపై
నిద్రిస్తుండడం
మారుతి
చూశాడు.
|
ముక్తామణిసమాయుక్తై:
భూషణైస్సువిభూషితామ్ |
విభూషయంతీమివ తత్
స్వశ్రియా భవనోత్తమమ్ || 51 ||
|
ఆమె
తన
శరీర, ఆభరణాలకాంతితో
ఆ
మహాభవనాన్ని
ప్రకాశింపచేస్తున్నట్లుంది.
|
గౌరీం కనకవర్ణాభామ్
ఇష్టామంత:పురేశ్వరీమ్
|
కపిర్మందోదరీం తత్ర
శయనాం చారురూపిణీమ్ || 52 ||
|
కనకవర్ణాంగి,
రావణుని
పట్టమహిషి అయిన
ఆ
మందోదరి రూపం
మనోహరంగా
ఉంది.
|
స తాం దృష్ట్వా మహాబాహు:
భూషితాం మారుతాత్మజ: |
తర్కయామాస సీతేతి
రూపయౌవనసంపదా |
హర్షేణ మహతా యుక్తో
ననంద హరియూథప: || 53 ||
|
రూప
యౌవన
సౌభాగ్యాలను
బట్టి
ఆమె
సీతయై ఉండవచ్చుననుకొని,
మిక్కిలి
హర్షోల్లసితుడయ్యాడు.
|
ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం
ననంద చిక్రీడ జగౌ జగామ |
స్తంభానరోహన్నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం
కపీనామ్
|| 54 ||
|
ఆనందంతో
భుజాస్ఫాలనం కావించాడు.
తోకను
ముద్దాడాడు.
అటూ
ఇటూ గంతులు వేశాడు.
స్తంభాలమీదకు
ప్రాకాడు. క్రిందికి
జారాడు.
కపిస్వభావాన్ని
ప్రదర్శించాడు.
|
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే
ఆదికావ్యే సుందరకాండే దశమస్సర్గః (10)