18, సెప్టెంబర్ 2016, ఆదివారం

రామసుందరం - పదునొకండవసర్గం - ద్వితీయభాగం

సుందరకాండ - ఏకాదశస్సర్గము

రాజతేషు చ కుంభేషు
జాంబూనదమయేషు చ |
పానశ్రేష్ఠం తదా భూరి
కపిస్తత్ర దదర్శ హ || 24||
మారుతి, వెండి బంగారు కడవల్లో
పూర్తిగా నింపబడిన
మేలైన
మద్యాన్ని

సో౭పశ్యచ్ఛాతకుంభాని
శీధోర్మణిమాయాని చ |
రాజతాని చ పూర్ణాని
భాజనాని మహాకపి: || 25||
చెఱకురసంతో చేసిన
మద్యం నిండిన
మణిమయ
బంగారు వెండి పాత్రల్ని

క్వచిదల్పావశేషాణి
క్వచిత్పీతాని సర్వశ: |
క్వచిన్నైవ ప్రపీతాని
పానాని స దదర్శ హ || 26||
సగం త్రాగినవి,
పూర్తిగా త్రాగినవి,
అసలు త్రాగనివి అయిన 
కొన్నిమద్యపాత్రల్ని చూశాడు.

క్వచిద్భక్ష్యాంశ్చ వివిధాన్
క్వచిత్పానాని భాగశ:|
క్వచిదర్ధావశేషాణి
పశ్యన్ వై విచచార హ || 27||
ఒకచోట బహువిధ భక్ష్యాలు,
ఇంకొకచో వేర్వేరుగా ఉన్న మద్యాలు,
ఒకచోట సగం మిగిలిన మద్యపాత్రల్ని
చూస్తూ తిరిగాడు.

క్వచిత్ ప్రభిన్నై: కరకై:
క్వచిదాలోళితైర్హటై: |
క్వచిత్ సంపృక్తమాల్యాని
జలాని చ ఫలాని చ || 28||
కొన్ని చోట్ల పగిలిన చిన్న చెంబులు,
దొర్లిన ఘటాలు,
వెదజల్లబడున్న
మాలలు, జలాలు, ఫలాలు (చూశాడు).

శయనాన్యత్ర నారీణాం
శుభ్రాణి బహుధా పున: |
పరస్పరం సమాశ్లిష్య
కాశ్చిత్ సుప్తా వరాంగనా: || 29||
శుభ్రంగా ఉన్న
స్త్రీల తల్పాలను,వాటిపై
పరస్పరం కౌగిలించుకొని పడుకొన్న
స్త్రీలను,  

కాశ్చిచ్చ వస్త్రమన్యస్యా:
స్వపంత్యా: పరిధాయ చ |
ఆహృత్య చాబలాస్సుప్తా
నిద్రాబలపరాజితా: || 30||
ఒళ్ళు మరచిన నిద్రలో
నిద్రిస్తున్న ప్రక్క స్త్రీల వస్త్రాలను లాగి,
తమ మేనికి చుట్టుకొన్నఆడవారిని,
చూస్తూ హనుమంతుడు తిరిగాడు.

తాసాముచ్ఛ్వాసవాతేన
వస్త్రం మాల్యం చ గాత్రజమ్ |
నాత్యర్థం స్పందతే చిత్రమ్
ప్రాప్య మందమివానిలమ్ || 31||
ఆ వనితల ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలకు,
వారి ఒంటిపై ఉన్న వస్త్రాలు, మాలలు
పిల్లగాలులకు కదలినట్లు
చిత్రంగా కొంచెం కదలుతున్నాయి.

చందనస్య చ శీతస్య
శీధోర్మధురసస్య చ |
వివిధస్య చ మాల్యస్య
ధూపస్య వివిధస్య చ || 32||
చల్లని చందనం,
తియ్యని మద్యం, 
వివిధ పరిమళ మాలలు,
ధూపాలు ఉన్నాయి.  

బహుధా మారుత స్తత్ర
గంధమ్ వివిధ ముద్వహన్ |
రసానాం చందనానాం చ
ధూపానాం చైవ మూర్ఛిత: || 33||
వాయువు (పైన చెప్పిన)
ఆ రస చందన ధూపాదుల
వివిధ గంధాలను
అంతటా వ్యాపింపచేస్తున్నాడు.

ప్రసవౌ సురభిర్గంధో
విమానే పుష్పకే తదా |
శ్యామావదాతాస్తత్రాన్యా:
కాశ్చిత్ కృష్ణావరాంగనా: || 34||
అప్పుడు ఆ సువాసనలు
పుష్పకం అంతటా వ్యాపించాయి.
అక్కడి స్త్రీలు కొందఱు చామనచాయ గలవారు.
నల్లని వారు కొందఱు,

కాశ్చిత్ కాంచనవర్ణాంగ్య:
ప్రమదా రాక్షసాలయే |
తాసాం నిద్రావశత్వాచ్చ
మదనేన విమూర్ఛితమ్ || 35||
బంగారువన్నె గలవారు కొందఱున్నారు.
నిద్రవల్లనూ,
కామకేళిలో అలసినందువల్లనూ,
నిద్రిస్తున్న వారి రూపాలు

పద్మినీనాం ప్రసుప్తానాం
రూపమాసీద్యథైవ హి |
ఏవం సర్వమశేషేణ
రావణాంతఃపురం కపి: |
దదర్శ సుమహాతేజా
న దదర్శ చ జానకీమ్ || 36||
ముకుళించిన తామరతీగల్లా ఉన్నాయి.
ఆ మారుతి
ఈవిధంగా ఉన్న
రావణాంతఃపురంలో
అడుగడుగూ గాలించాడు.
జానకిని మాత్రం చూడలేకపోయాడు.

నిరీక్షమాణశ్చ తదా
తాస్స్త్రియ స్స మహాకపి: |
జగామ మహతీం శంకామ్ 
ధర్మసాధ్వసశంకిత: || 37||
ఆ స్త్రీలను చూస్తున్న
ఆ మారుతి
ధర్మలోపం కల్గింది కదా
అనే సంశయంతో చింతించాడు.

పరదారావరోధస్య
ప్రసుప్తస్య నిరీక్షణమ్ |
ఇదం ఖలు మమాత్యర్థం
ధర్మలోపం కరిష్యతి || 38||
“ఈ నిద్రిస్తున్న
పరదారలను
చూడడం
నాకు ధర్మలోపం కల్గిస్తుంది.

న హి మే పరదారాణాం
దృష్టిర్విషయవర్తినీ |
అయం చాత్ర మయా దృష్ట:
పరదారపరిగ్రహ: || 39||
పరసతులమీద
నాకు విషయవాసనాదృష్టే లేదు.
కానీ పరదారను పరిగ్రహించిన
రావణుడు నా కంట పడ్డాడు”.

తస్య ప్రాదురభూచ్చింతా
పునరన్యా మనస్విన: |
నిశ్చితైకాంతచిత్తస్య
కార్యనిశ్చయదర్శినీ || 40||
నిశ్చితైకాంతచిత్తుడు,
కార్యనిశ్చయదర్శినుడు,
మనస్వినుడు అయిన
ఆ మారుతికి మరో చింత కలిగింది.

కామం దృష్టా మయా
సర్వా విశ్వస్తా రావణస్త్రియ: |
న హి మే మనస:కించిత్ 
వైకృత్యముపపద్యతే || 41||
“ఇతరులు చూస్తున్నారనే  భయం లేనందున 
యథేచ్చగా నిద్రిస్తున్న
రావణాసురుని కాంతలందర్నీ నేను
స్వేచ్ఛగా చూశాను. ఐనా నా మనస్సుకు
ఎట్టి వికారమూ కలగలేదు.

మనో హి హేతుస్సర్వేషామ్
ఇంద్రియాణాం ప్రవర్తనే |
శుభాశుభాస్వవస్థాసు
తచ్చ మే సువ్యవస్థితమ్ || 42||
అన్ని ఇంద్రియాల
శుభాశుభవ్యాపారాలకు
మూలమైనట్టిది మనస్సే కదా!
ఆ మనసు నాకు పాపచింతా
రహితమై పరిశుద్ధంగానే ఉంది.

నాన్యత్ర హి మయా శక్యా
వైదేహీ పరిమార్గితుమ్ |
స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే
సదా సంపరిమార్గణే || 43||
ఇక్కడ కాక ఇంకెక్కడ
సీతను వెదుకను?
ఆడువారిని ఆడువారియందే కదా
వెదకాలి!

యస్య సత్త్వస్య యా యోని:
తస్యామ్ తత్పరిమార్గ్యతే |
నశక్యా ప్రమదా నష్టా
మృగీషు పరిమార్గితుమ్ || 44||
ఒక జంతువును
ఆ జాతి జంతువుల మధ్యనే వెదకాలి.
తప్పిపోయిన ఇంతిని వెదకడం
మృగాలమధ్య సాధ్యం కాదు కదా!

తదిదం మార్గితం తావత్
శుద్ధేన మనసా మయా |
రావణాంత:పురం సర్వం
దృశ్యతే న చ జానకీ ||45 ||
అందువల్ల
శుద్ధమైన మనస్సుతో
ఈ రావణాంత:పురం మొత్తం గాలించాను.
జానకి మాత్రం కనిపించలేదు”.

దేవగంధర్వకన్యాశ్చ
నాగకన్యాశ్చ వీర్యవాన్ |
అవేక్షమాణో హనుమాన్
నైవాపశ్యత జానకీమ్ || 46||
దేవకన్యలను, గంధర్వకన్యలను
నాగకన్యలను చూశాడు కానీ
హనుమంతుడు
సీతను మాత్రం చూడలేకపోయాడు.

తామపశ్యన్ కపి స్తత్ర
పశ్యంశ్చాన్యా వరస్త్రియ: |
అపక్రమ్య తదా వీర:
ప్రధ్యాతు ముపచక్రమే || 47||
మారుతి, సీతను కానక
ఎందఱో ఇతర స్త్రీలను చూస్తూ,
ఆ చోటు విడచి,
ఆలోచనలో పడ్డాడు.

స భూయస్తు పరం శ్రీమాన్
మారుతి ర్యత్నమాస్థిత: |
ఆపానభూమి ముత్సృజ్య
తాం విచేతుం ప్రచక్రమే || 48||
(ఆ తర్వాత) శ్రీమంతుడైన ఆ హనుమంతుడు
ఆ పానభూమిని విడచి,
తీవ్రమైన ప్రయత్నంతో మళ్లీ
ఆ రావణాంతఃపురంలో సీతను వెదకసాగాడు.
 

 

 

మంగళం మహత్