13, నవంబర్ 2012, మంగళవారం

రామసుందరం - 9

బ్లాగ్ మిత్రులకు, ప్రియపాఠకులకు
దివ్య దీపావళి శుభాకాంక్షలు.



ఏవముక్త: కపిశ్రేష్ఠః
తం నగోత్తమమబ్రవీత్ |
ప్రీతో౭ స్మి కృతమాతిథ్యం
మన్యురేషో౭పనీయతామ్ || 130
మైనాకుని మాటలను విన్న హనుమంతుడు,
" మీ మాటలకు, ఆదరణకు తృప్తి చెందాను.
ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే భావించు.
ఏమీ అనుకోవద్దు.

త్వరతే కార్యకాలో మే
అహశ్చాప్యతివర్తతే |
ప్రతిజ్ఞా చ మయా దత్తా
న స్థాతవ్యమిహాంతరే || 131
సమయం మించిపోతోంది.
పగలు గడచి ప్రొద్దు క్రుంకుతోంది.
మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేశాను.
కాన మార్గమధ్యంలో ఇక్కడ ఆగడానికి వీలు లేదు."

ఇత్యుక్త్వా పాణినా శైలమ్
ఆలభ్య హరిపుంగవః |
జగామాకాశమావిశ్య
వీర్యవాన్ ప్రహసన్నివ || 132
అని తన కరస్పర్శతో
మైనాకుని ఆతిథ్యాన్ని స్వీకరించినట్లు ప్రకటించి,
ప్రసన్నముఖుడై,
ఆకాశంలో కొంత పైకెగిరి, వేగంగా ముందుకు సాగాడు.

స పర్వతసముద్రాభ్యాం
బహుమానాదవేక్షితః |
పూజిత శ్చోపపన్నాభిః
ఆశీర్భిరనిలాత్మజః || 133

అతణ్ణి సముద్రుడు, మైనాకుడు
మిక్కిలి ఆదరంతో చూస్తూ, పూజించారు.
ఆశీర్వచనాలతో అభినందించారు.

అథోర్ధ్వం దూరముత్ప్లుత్య
హిత్వా శైలమహార్ణవౌ |
పితుఃపంథాన మాస్థాయ
జగామ విమలే౭oబరే || 134

హనుమంతుడు
సముద్రుని, మైనాకుని వీడ్కొని,
ఇంకా వేగంగా,
భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య
గిరిం తమవలోకయన్ |
వాయుసూనుర్నిరాలంబే 
జగామ విమలే౭oబరే || 135

ఇంకా పైకెగిరి,
మైనాకుని చూస్తూ
ముందుకు సాగిపోయాడు.

తద్ద్వితీయం హనుమతో
దృష్ట్వాకర్మ సుదుష్కరమ్ |
ప్రశశంసు స్సురాస్సర్వే
సిద్ధాశ్చ పరమర్షయః || 136
హనుమంతుడు ఒనర్చిన ఈ రెండవ కార్యాన్ని చూసి,
దేవతలు, సిద్ధులు, ఋషులందరూ ఆయనను ప్రశంసించారు. (ఆకాశాన ఎగరడం మొదటిది.
మైనాకుని అడ్డంకిని అధిగమించి, పురోగమించడం రెండవది.)

దేవతాశ్చాభవన్ హృష్టాః
తత్రస్థాస్తస్య కర్మణా |
కాంచనస్య సునాభస్య
సహస్రాక్షశ్చ వాసవః || 137

ఇంద్రుడు, దేవతలు
మైనాకుడు చేసినపనికి హర్షించారు.

ఉవాచ వచనం ధీమాన్
పరితోషాత్ సగద్గదమ్ |
సునాభం పర్వతశ్రేష్ఠం
స్వయమేవ శచీపతిః || 138

సహస్రాక్షుడు (ఇంద్రుడు)
గద్గదస్వరంతో
స్వయంగా

హిరణ్యనాభ! శైలేంద్ర!
పరితుష్టో౭స్మి తే భృశమ్ |
అభయం తే ప్రయచ్ఛామి
తిష్ఠ సౌమ్య! యథాసుఖమ్ || 139

" ఓ మైనాకా!
నీవు చేసిన ఈ పనికి ఎంతో సంతోషించాను.
ఇక నీకు నా భయం లేదు.
హాయిగా ఉండు.
సాహ్యం కృతం తే సుమహ
ద్విక్రాంతస్య హనూమతః |
క్రమతో యోజనశతం
నిర్భయస్య భయే సతి || 140

భయమే ఎఱుగని హనుమంతునకు
గొప్పగా సహాయపడ్డావు.

రామస్త్యైష హి దూత్యేన
యాతి దాశరథేర్హరిః |
సత్ర్కియాం కుర్వతా తస్య
తోషితో౭స్మి దృఢం త్వయా || 141


ఆతని సత్కరించినందులకు
చాల ఆనందిస్తున్నాను." అన్నాడు.

తతః ప్రహర్ష మగమత్
విపులం పర్వతోత్తమః |
దేవతానాం పతిం దృష్ట్వా
పరితుష్టం శతక్రతుమ్ || 142

ఇంద్రుని పరితుష్టిని చూసి,
మైనాకుడు సంతోషించాడు.

స వై దత్తవర శ్శైలో
బభూవావస్థిత స్తదా |
హనుమాంశ్చ ముహూర్తేన
వ్యతిచక్రామ సాగరమ్ || 143

ఇంద్రుని అభయవరంతో
అతని మనస్సు కుదుటపడింది.
హనుమంతుడు,
ఆ ప్రదేశాన్ని క్షణంలో దాటిపోయాడు.

తతో దేవా స్సగంధర్వాః
సిద్ధాశ్చ పరమర్షయః |
అబ్రువన్ సూర్యసంకాశాం
సురసాం నాగమాతరమ్ || 144

తరువాత దేవతలు, గంధర్వులు,
సిద్ధులు, మహర్షులు,
నాగమాతయైన సురసతో
ఇలా అన్నారు.

అయం వాతాత్మజశ్శ్రీమాన్
ప్లవతే సాగరోపరి |
హనుమాన్నామ తస్య త్వం
ముహూర్తం విఘ్నమాచర || 145

హనుమంతుడనేవాడు వస్తున్నాడు.
అతనికి క్షణకాలం
విఘ్నం కల్గించు.

రాక్షసం రూపమాస్థాయ
సుఘోరం పర్వతోపమమ్ |
దంష్ట్రాకరాళం పింగాక్షం
వక్త్రం కృత్వా నభస్సమమ్ || 146

భయంకరాలైన కోఱలతో
పచ్చని నేత్రాలు,
ఆకాశమంత వెడల్పైన నోరు,
పర్వతసమానమైన రాక్షసరూపం ధరించు.

బలమిచ్ఛామహే జ్ఞాతుం
భూయశ్చాస్య పరాక్రమమ్ |
త్వాం విజేష్యత్యుపాయేన
విషాదం వా గమిష్యతి || 147


ఇతని బలపరాక్రమాలను
మళ్లీ తెలుసుకోవాలనుకొంటున్నాం.
నిన్ను ఉపాయంతో జయిస్తాడా?
లేక (ఓడిపోయి) విచారిస్తాడా? "
ఏవముక్తా తు సా దేవీ
దైవతై రభిసత్కృతా |
సముద్రమధ్యే సురసా
బిభ్రతీ రాక్షసం వపుః || 148

దేవతలు ఇలా అన్నమీదట
సురస అట్లే భయంకరాకారం ధరించి,
సముద్రమధ్యంలో
వికృతం చ విరూపం చ
సర్వస్య చ భయావహమ్ |
ప్లవమానం హనూమంతం
ఆవృత్యేదమువాచ హ || 149





శుభం భూయాత్
హనుమంతుని అడ్డగించి,
ఇలా అంది.

11, నవంబర్ 2012, ఆదివారం

రామసుందరం - 8



దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమః |
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖమ్ || 111
"  వానరోత్తమా! నీవీ దుష్కరకార్యానికి పూనుకొన్నావు. (అలసిపోయావేమో?)
నా శిఖరప్రదేశాల్లో నిలచి, హాయిగా కొంతసేపు విశ్రమించు.
రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్థితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః || 112

సాగరుడు నీకు సపర్యలు చేయాలనుకొంటున్నాడు.
కృతే చ ప్రతి కర్తవ్యమ్ ఏవ ధర్మ స్సనాతనః |
సో౭యం త్వత్ర్పతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి || 113
మేలు చేసినవారికి ప్రత్యుపకారం చేయడం కర్తవ్యం.
అది సనాతన శాశ్వత ధర్మ లక్షణం.
సాగరుడు నా ద్వారా నీ సమ్మానం పొందటానికి అర్హుడు.

త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః |
తిష్ఠ త్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్ || 114

కనుక సముద్రుని కోరిక మీద

యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః |
తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి || 115

కొంతసేపు నా పై విశ్రమించి, ముందుకు సాగు.

తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలం బహు |
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతో౭నుగమిష్యసి || 116
ఇక్కడ కమ్మని వాసనల్ని కుమ్మరించే కందమూలఫలాలున్నాయి. ఎంతో రుచి గల వాటిని ఆస్వాదించు.


అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయా౭స్తివై |
ప్రఖ్యాత స్త్రిషులోకేషు మహాగుణపరిగ్రహః || 117              
నీకు మాతోనూ సంబంధం ఉంది. నీవు మహాగుణపరిగ్రహునిగా
ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవు.

వేగవంతః ప్లవంతో యే ప్లవంగా మారుతాత్మజ |
తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర || 11 8
 
వేగంగా ఎగిరే వానరుల్లో ప్రముఖుడవు.
అతిథిః కిల పూజార్హః ప్రాకృతో౭పి విజానతా |
ధర్మం జిజ్ఞాసమానేన కిమ్ పునస్త్వాదృశో మహాన్ ||  119             
సామాన్యుడైన అతిథినైనా పూజించడం బుద్ధిమంతులు పాటించే ధర్మం. ఇక మహాత్ముల విషయం చెప్పనేల?

త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః |
పుత్త్రస్తస్యైవ వేగేన సదృశ: కపికుంజర || 120

నీ తండ్రి వాయుదేవునకు నీవే సాటి.

పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత: |
తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణమ్ || 120                     
నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే.
అందువల్ల నీవు నాకు పూజ్యుడవు. కారణం చెప్తా విను.
పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో౭భవన్ |
తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిలవేగినః || 122 
పూర్వం కృతయుగంలో పర్వతాలకు ఱెక్కలుండేవి.
అవి వాయుగరుడవేగాలతో అన్ని దిక్కులకూ ఎగురుతూండేవి.


తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాస్సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా || 123  
అవి తమ మీద పడుతాయేమో అని
దేవతలు, ఋషులు, అందరూ భయపడుతూండేవారు.

తతః క్రుద్ధ స్సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః |
పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః || 124
దాంతో ఇంద్రుడు కోపించి,
వాటి ఱెక్కలన్నిటినీ పూర్తిగా ఖండించేశాడు.

స మాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ |
తతో౭హం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా || 125 
నా వద్దకు కూడా వస్తూండగా,
వాయుదేవుడు నన్ను నేర్పుగా సముద్రంలో పడేశాడు.

అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ |
గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రా౭భిరక్షితః || 126
నేను సముద్రంలో భద్రంగా ఉన్నానంటే
అది నీ తండ్రి చలువ.

తతో౭హం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః |
త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః || 127    
అందువల్ల నీ తండ్రి నాకు పూజ్యుడు. కాబట్టి నిన్ను ఆదరిస్తున్నాను.
ఇదీ నీకు నాకు గల సంబంధం.

తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ |
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే || 128

ఈ కారణంగా నీవు,  నాకు సముద్రునికి  ప్రీతి కల్గించు.

శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతో౭స్మి తవ దర్శనాత్ || 129 




 శుభం భూయాత్
నీ దర్శనం వల్ల ఆనందించాను. కొంతసేపు ఆగి అలుపు తీర్చుకో.
మా పూజలందుకో.  ప్రేమను ఆదరించు. "