11, నవంబర్ 2012, ఆదివారం

రామసుందరం - 8



దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమః |
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖమ్ || 111
"  వానరోత్తమా! నీవీ దుష్కరకార్యానికి పూనుకొన్నావు. (అలసిపోయావేమో?)
నా శిఖరప్రదేశాల్లో నిలచి, హాయిగా కొంతసేపు విశ్రమించు.
రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్థితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః || 112

సాగరుడు నీకు సపర్యలు చేయాలనుకొంటున్నాడు.
కృతే చ ప్రతి కర్తవ్యమ్ ఏవ ధర్మ స్సనాతనః |
సో౭యం త్వత్ర్పతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి || 113
మేలు చేసినవారికి ప్రత్యుపకారం చేయడం కర్తవ్యం.
అది సనాతన శాశ్వత ధర్మ లక్షణం.
సాగరుడు నా ద్వారా నీ సమ్మానం పొందటానికి అర్హుడు.

త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః |
తిష్ఠ త్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్ || 114

కనుక సముద్రుని కోరిక మీద

యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః |
తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి || 115

కొంతసేపు నా పై విశ్రమించి, ముందుకు సాగు.

తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలం బహు |
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతో౭నుగమిష్యసి || 116
ఇక్కడ కమ్మని వాసనల్ని కుమ్మరించే కందమూలఫలాలున్నాయి. ఎంతో రుచి గల వాటిని ఆస్వాదించు.


అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయా౭స్తివై |
ప్రఖ్యాత స్త్రిషులోకేషు మహాగుణపరిగ్రహః || 117              
నీకు మాతోనూ సంబంధం ఉంది. నీవు మహాగుణపరిగ్రహునిగా
ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవు.

వేగవంతః ప్లవంతో యే ప్లవంగా మారుతాత్మజ |
తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర || 11 8
 
వేగంగా ఎగిరే వానరుల్లో ప్రముఖుడవు.
అతిథిః కిల పూజార్హః ప్రాకృతో౭పి విజానతా |
ధర్మం జిజ్ఞాసమానేన కిమ్ పునస్త్వాదృశో మహాన్ ||  119             
సామాన్యుడైన అతిథినైనా పూజించడం బుద్ధిమంతులు పాటించే ధర్మం. ఇక మహాత్ముల విషయం చెప్పనేల?

త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః |
పుత్త్రస్తస్యైవ వేగేన సదృశ: కపికుంజర || 120

నీ తండ్రి వాయుదేవునకు నీవే సాటి.

పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత: |
తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణమ్ || 120                     
నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే.
అందువల్ల నీవు నాకు పూజ్యుడవు. కారణం చెప్తా విను.
పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో౭భవన్ |
తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిలవేగినః || 122 
పూర్వం కృతయుగంలో పర్వతాలకు ఱెక్కలుండేవి.
అవి వాయుగరుడవేగాలతో అన్ని దిక్కులకూ ఎగురుతూండేవి.


తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాస్సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా || 123  
అవి తమ మీద పడుతాయేమో అని
దేవతలు, ఋషులు, అందరూ భయపడుతూండేవారు.

తతః క్రుద్ధ స్సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః |
పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః || 124
దాంతో ఇంద్రుడు కోపించి,
వాటి ఱెక్కలన్నిటినీ పూర్తిగా ఖండించేశాడు.

స మాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ |
తతో౭హం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా || 125 
నా వద్దకు కూడా వస్తూండగా,
వాయుదేవుడు నన్ను నేర్పుగా సముద్రంలో పడేశాడు.

అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ |
గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రా౭భిరక్షితః || 126
నేను సముద్రంలో భద్రంగా ఉన్నానంటే
అది నీ తండ్రి చలువ.

తతో౭హం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః |
త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః || 127    
అందువల్ల నీ తండ్రి నాకు పూజ్యుడు. కాబట్టి నిన్ను ఆదరిస్తున్నాను.
ఇదీ నీకు నాకు గల సంబంధం.

తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ |
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే || 128

ఈ కారణంగా నీవు,  నాకు సముద్రునికి  ప్రీతి కల్గించు.

శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతో౭స్మి తవ దర్శనాత్ || 129 




 శుభం భూయాత్
నీ దర్శనం వల్ల ఆనందించాను. కొంతసేపు ఆగి అలుపు తీర్చుకో.
మా పూజలందుకో.  ప్రేమను ఆదరించు. "
















కామెంట్‌లు లేవు: