24, మే 2020, ఆదివారం

తర్కం


సంశయభ్రాంతిజ్ఞానాదుల్ని ఏది తీర్చగలదో దాన్ని తర్కం అంటారు.
సంశయం అంటే సందేహం మఱియు నిశ్చయం ఈ రెండింటిలోనూ ఉండేది.
అంటే ఒక వస్తునిర్ణయమందు పలు శంకలు కల్గడం.
అంటే సందేహం కలుగుతూ ఉంటుంది మళ్ళీ నిజం అనిపిస్తూ ఉంటుంది. తేల్చుకోలేని స్థితి.
భ్రాంతి అంటే మిథ్యామతి అంటే అసత్య బుద్ది.
అంటే ఒకదాన్ని చూచి మఱియొకటి అని అనుకోవడం.
వీటిని తీర్చుకొని, సత్యజ్ఞానం కలిగించుకోవాలంటే తర్కం అవసరం.
నిఘంటువులు,- ఊహ, అధ్యాహారం(లేని పదాలు కొన్ని తెచ్చుకోవడం), కారణం, కోరిక, ఒక శాస్త్రం అని చెప్తాయి.
ఇలా చెప్తే మీకు అర్థం అవుతుందేమో చూద్దాం.
ఒక విషయం యొక్క తత్త్వం (స్వస్వరూపజ్ఞానం)తెలియనపుడు కారణోపపత్తి (ఏ కారణం చేత పుట్టింది)వల్ల దాని తత్త్వం తెలుసుకోవడం కోసం చేసే ఊహ తర్కం.