1, అక్టోబర్ 2017, ఆదివారం

రామసుందరం - పండ్రెండవసర్గం - ద్వితీయభాగం




భూమీ గృహాంశ్చైత్య గృహాన్
గృహాతిగృహకానపి |
ఉత్పతన్నిష్పతంశ్చాపి
తిష్ఠన్గచ్ఛన్ పునః పునః ||15

అన్ని రకాల గృహాల్ని
మళ్లీ మళ్లీ వెదకాడు.
యా చోట్ల ఎక్కుతూ, దిగుతూ, నిలబడుతూ, ముందుకువెళ్తూ,
అపావృణ్వంశ్చ ద్వారాణి
వాటాన్యవఘాటయన్ |
ప్రవిశన్నిష్పతంశ్చాపి
ప్రపతన్నుత్పతన్నపి ||16

తలుపులు తెరుస్తూ,
మూస్తూ,
లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ,
వెదకాడు.
సర్వమప్యవకాశం
విచచార మహాకపిః |
చతురంగుళమాత్రో2పి
నావకాశః విద్యతే |
రావణాన్తఃపురే తస్మిన్
యం కపిర్న జగామ సః |17

ఇలా
హనుమ
వెదకని స్థలం లేదు.
రావణాంతఃపురంలో
ప్రతి అంగుళం
గాలించేశాడు.
ప్రాకరాన్తర రథ్యాశ్చ
వేదికాశ్చైత్య సంశ్రయాః |
దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ
సర్వం తేనావలోకితమ్ ||18
 
వీథుల్ని,
కూడళ్లను,
వేదికల్ని,
దిగుడుబావుల్ని, సరస్సుల్ని పరిశీలించాడు.
రాక్షస్యో వివిధాకారా
విరూపా వికృతాస్తథా |
దృష్టా నుమతా తత్ర
తు సా జనకాత్మజా ||19

వివిధాకారాల
రాక్షసస్త్రీలని
చూశాడు.
జానకి మాత్రం కనబడలేదు.
రూపేణాప్రతిమా లోకే
వరా విద్యాధర స్త్రియః |
దృష్టా నుమతా తత్ర
తు రాఘవ నన్దినీ ||20

విద్యాధరస్త్రీలు
కనిపించారు
కానీ
రాఘవపత్ని కనబడలేదు.
నాగ కన్యా వరారోహాః
పూర్ణ చన్ద్ర నిభాననాః |
దృష్టా నుమతా తత్ర
తు సీతా సుమధ్యమా ||21

నాగకన్యలు
కనిపించారు
కానీ
సీత కనబడలేదు.
ప్రమథ్య రాక్షసేన్ద్రేణ
నాగ కన్యా బలాద్ధృతాః |
దృష్టా నుమతా తత్ర
సా జనక నన్దినీ ||22

నిర్బంధాల్లో ఉన్న
నాగకన్యల్ని చూశాడు
కానీ
జానకి కనబడలేదు.
సో2పశ్యంస్తాం మహా బాహుః
పశ్యంశ్చాన్యా వర స్త్రియః |
విసాద ముహుర్ధీమాన్
నుమాన్ మారుతాత్మజః ||23

ఎందఱో సుందరీమణుల్ని
చూశాడు కానీ
(సీత కనబడకపోవడంతో)
ఎంతో విచారగ్రస్తుడయ్యాడు.
ఉద్యోగం వానరేన్ద్రాణం
ప్లవనం సాగరస్య |
వ్యర్థం వీక్ష్యానిలసుత
శ్చిన్తాం పునరుపాగమత్ ||24

వానరేంద్రుల ప్రయత్నం,
తన సాగరలంఘనం,
వ్యర్థాలైనవికదా అని
చింతించాడు.
అవతీర్య విమానాచ్చ
నుమాన్ మారుతాత్మజః |
చిన్తాముపజగామాథ
శోకోపహత చేతసః ||25

 

 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సున్దరకాణ్డే ద్వాదశస్సర్గః |

మంగళం మహత్



 
హనుమ
విమానం నుండి దిగి,
కలవరపాటుకు గురై,
ఆలోచనలో పడ్డాడు.