12, సెప్టెంబర్ 2026, శనివారం

జాషువా కవిత్వంలో అంతరార్థం

సందేశం పాఠంలో పూప వయస్సులో తెలుగు వలసపోయింది అని కవి అనటంలో అంతరార్థం ఎవరైనా తెలుపగలరు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య 

             క్రీ.శ 16 వ శతాబ్దం తెలుగు కవిత్వానికి స్వర్ణయుగం. ఈ కాలంలో సంస్కృతం నుండి దిగుమతి చేయడానికి కవులకు ఏదీ మిగలలేదు. అందుకే స్వతంత్రకావ్యనిర్మాణం అవసరమైంది. ఈ ఆలోచనే ప్రబంధయుగానికి మారాకు వేసింది. ఈ కాలంలోని అభినవ భోజుడు కృష్ణ రాయలు విశేషంగా కవిపండితకళాకారులను ఆదరించాడు.


            విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత రాజాదరణ కోల్పోయిన తెలుగు కవులను అభినవకృష్ణరాయలైన రఘునాథుడు ఆదరించాడు. దాంతో  భువనవిజయం లాంటి విజయభవనంలో తెలుగు కవిత్వం కళకళలాడింది.


           మొదటినుండి అనువాద కవిత్వంతో పరిఢవిల్లిన తెలుగు కవిత ప్రబంధ
శిశువుగా  కొత్తరూపంతో  ప్రభవించింది. కాని  తక్కువ కాలమే లాలింపబడింది కాబట్టి ఇంకా పూపవయస్సే. 


            రఘునాథునికి తెలుగు అంటే ఇష్టమని ఆదరిస్తున్నాడని తెల్సి, కవులు తంజాపురికి తరలిపోయారని చెప్తూ జాషువా ఆ విధంగా చమత్కరించారు. 

ఇది నా అభిప్రాయం.

మంగళం మహత్