13, మే 2018, ఆదివారం

రామసుందరం - పదుమూడవసర్గం - తృతీయభాగం


సుందరకాండ – త్రయోదశస్సర్గము - 3గత్వా తు యది కాకుత్స్థం
వక్ష్యామి పర మప్రియమ్ |
న దృష్టేతి మయా సీతా
తతస్త్యక్ష్యతి జీవితమ్ ||23
(కిష్కింధకు) వెళ్లి, కాకుత్స్థునితో
సీత నాకు కన్పించలేదు
అనే అప్రియవార్తను చెప్తే,
తత్క్షణమే అతడు జీవితాన్ని చాలిస్తాడు

పరుషం దారుణం క్రూరం
తీక్ష్ణ మిన్ద్రియతాపనమ్ |
సీతానిమిత్తం దుర్వాక్యం
శ్రుత్వా స న భవిష్యతి ||24
పరుషం దారుణం క్రూరం తీక్ష్ణం ఇంద్రియతాపనం అయిన
సీత నాకు కన్పించలేదు
అనే దుర్వాక్యం వింటే
రాముడుండడు

తం తు కృచ్ఛ్రగతం దృష్ట్వా
పఞ్చత్వగతమానసమ్ |
భృశానురక్తో మేధావీ
న భవిష్యతి లక్ష్మణః ||25
కష్టస్థితికి గురై
మరణించాలనుకొనే రాముని చూచి,
గాఢానురాగుడు, మేధావి అయిన
లక్ష్మణుడు జీవింపడు

వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా
భరతోఽపి మరిష్యతి |
భరతం చ మృతం దృష్ట్వా
శత్రుఘ్నో న భవిష్యతి ||26
సోదరులిద్దఱూ లేరని వినగానే,
భరతుడు కూడా మరణిస్తాడు
భరతుని మృతి చూచి,
శత్రుఘ్నుడు బ్రతుకడు

పుత్రాన్మృతాన్సమీక్ష్యాథ
న భవిష్యన్తి మాతరః |
కౌసల్యా చ సుమిత్రా చ
కైకేయీ చ న సంశయః ||27
పుత్రుల మరణాలను చూచి,
తల్లులైన
కౌసల్య సుమిత్ర కైకేయిలు
జీవించరనేది నిస్సంశయం

కృతజ్ఞస్సత్యసన్ధశ్చ
సుగ్రీవః ప్లవగాధిపః |
రామం తథా గతం దృష్ట్వా
తతస్త్యక్ష్యతి జీవితమ్ ||28
కృతజ్ఞుడు, సత్యసంధుడైన
సుగ్రీవుడు,
రాముని స్థితి చూసి,
జీవితాన్ని చాలిస్తాడు

దుర్మనా వ్యథితా దీనా
నిరానన్దా తపస్వినీ |
పీడితా భర్తృశోకేన
రుమా త్యక్ష్యతి జీవితమ్ ||29
భర్తృశోకంతో పీడింపబడి,
పతివ్రతయైన
రుమ
జీవితాన్ని చాలిస్తుంది

వాలిజేన తు దుఃఖేన
పీడితా శోకకర్శితా |
పఞ్చత్వం చ గతే రాజ్ఞి
తారాఽపి న భవిష్యతి ||30
వాలి మరణంతో దుఃఖపీడితురాలైన
తార కూడా
సుగ్రీవుడు మరణిస్తే,
బ్రతుకదు

మాతాపిత్రోర్వినాశేన
సుగ్రీవవ్యసనేన చ |
కుమారోఽప్యఙ్గదః కస్మా
ద్ధారయిష్యతి జీవితమ్ ||31
తల్లిద్రండ్రుల్ని,
పినతండ్రి సుగ్రీవుని, కోల్పోయిన
అంగదుడు
బ్రతికి ఉండ గలడా?

భర్తృజేన తు దుఃఖేన
హ్యభిభూతా వనౌకసః |
శిరాంస్యభిహనిష్యన్తి
తలైర్ముష్టిభిరేవ చ ||32
ప్రభువు (సుగ్రీవమరణం) వల్ల కల్గిన దుఃఖంతో,
వానరులు,
అరచేతులతో, పిడికిళ్లతో,
తలలు బాదుకొంటారు

సాన్త్వేనానుప్రదానేన
మానేన చ యశస్వినా |
లాలితాః కపిరాజేన
ప్రాణాంస్త్యక్ష్యన్తి వానరాః ||33
సుగ్రీవుని అనునయవచనాలతో,
బహుమానాలతో, మన్ననలతో,
ఇంతవఱకు లాలింపబడిన వానరులు
ప్రాణాలు విడుస్తారు  

న వనేషు న శైలేషు
న నిరోధేషు వా పునః |
క్రీడామనుభవిష్యన్తి
సమేత్య కపికుఞ్జరాః ||34

మంగళం మహత్
 

వానరశ్రేష్ఠులందఱూ
కలసి ఇకమీద
వన పర్వత గృహాల్లో
క్రీడలను అనుభవింపలేరు