11, ఏప్రిల్ 2024, గురువారం

అభిజ్ఞాన శాకుంతలం

పంచమోఽంకంలో 2 వ శ్లోకం.

రాజా:

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ 

పర్యుత్సుకో భవతి యత్సుఖితోఽపి జంతుః 

తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం 

భావస్థిరాణి జననాంతరసౌహృదాని.


అందమైనవాటిని చూసినప్పుడుగాని, మధురమైన శబ్దాలను (పాటలు, పదాలు) విన్నప్పుడుగాని, సుఖంగా ఉన్నవాడు కూడ ఒక రకమైన వేదనకు/చింతకు గుఱవుతున్నాడంటే ఆతడు ముందెపుడూ ఎఱుగనిదానిని దేన్నో మనసా స్మరిస్తున్నాడన్నమాట. నిశ్చయం. (అవి) పూర్వజన్మలలోని అచ్చికబుచ్చికలు/పరిచయాలు/సాంగత్యాలు మనసులో వాసనారూపంలో నెలకొన్న స్థిరమైన భావాలు. 


ప్రస్తుతం దర్శించిన, విన్న సౌందర్యమధురాలు పూర్వజన్మలో అంతరంగంలో స్థిరంగా నిలిచిన (ఏవో అవ్యక్త) భావాల్ని గుర్తుకు తెస్తూంటాయని కవి భావం.


మంగళం మహత్

కామెంట్‌లు లేవు: