6, ఏప్రిల్ 2013, శనివారం

రామసుందరం - 10




మమ భక్షః ప్రదిష్ట స్త్వమ్
ఈశ్వరై ర్వానరర్షభ|
అహం త్వాం భక్షయిష్యామి
ప్రవిశేదం మమాననమ్|| 150
ఓ వానరేశ్వరా!
దేవతలు నిన్నునాకు ఆహారంగా నిర్ణయించారు.
నిన్ను తింటాను.
నా నోటిలో ప్రవేశించు“.


ఏవముక్త స్సురసయా
ప్రాంజలి ర్వానరర్షభః|
ప్రహృష్టవదన శ్శ్రీమాన్
ఇదం వచన మబ్రవీత్|| 151
సురస ఇలా అనగా,
హనుమంతుడు చేతులు జోడించి,
ప్రసన్నవదనుడై 
ఇలా అన్నాడు.


రామో దాశరథిర్నామ
ప్రవిష్టో దండకావనమ్|
లక్ష్మణేన సహ భ్రాత్రా
వైదేహ్యా చాపి భార్యయా|| 152
దశరథుని కొడుకైన శ్రీరాముడు
తన తమ్ముడు లక్ష్మణునితోను,
భార్య సీతతోను కలసి
దండకారణ్యాన ప్రవేశించాడు.


అన్యకార్యవిషక్తస్య
బద్ధవైరస్య రాక్షసైః|
తస్య సీతా హృతా భార్యా
రావణేన యశస్వినీ|| 153 
రాక్షసులతో బద్ధవైరం కలిగి ఉన్నఆయన, ఒకప్పుడుఅన్యకార్యమందుండగా
అతని భార్య సీతను 
రావణుడు, అపహరించుకొనిపోయాడు.


తస్యాస్సకాశం దూతో౭హం
గమిష్యే రామశాసనాత్|
కర్తు మర్హసి రామస్య
సాహ్యం విషయవాసిని|| 154
నేను, రాముని పంపున దూతనై,
సీత కడకు వెళుతున్నాను.
నీవునూ  రాముని రాజ్యంలో ఉన్నదానవు.
ఆయనకు సాయం చేయాలి.


అథవా మైథిలీం దృష్ట్వా
రామం చాక్లిష్టకారిణమ్|
ఆగమిష్యామి తే వక్త్రం
సత్యం ప్రతిశృణోమి తే|| 155
అలా కాదూ అంటే,
సీతను చూసి,
రాముని సందర్శించి,
నీ ముఖాన ప్రవేశిస్తాను. ఇది సత్యం“.


ఏవముక్తా హనుమతా
సురసా కామరూపిణీ|
అబ్రవీ న్నాతివర్తే న్మాం
కశ్చి దేష వరో మమ|| 156
హనుమంతుడు ఇలా అన్నాక
ఆ కామరూపిణి
ఎవ్వరునూ నన్ను కాదని ముందుకు పోలేరు.
ఇది నాకు వరం అంది.


తం ప్రయాంతం సముద్వీక్ష్య
సురసా వాక్య మబ్రవీత్|
బలం జిజ్ఞాసమానా వై
నాగమాతా హనూమతః|| 157
(అయినా) ముందుకు వెళ్తున్న
హనుమంతుని చూచి,
అతని బలాన్ని పరీక్షించ కోరి,
నాగమాతయైన సురస


ప్రవిశ్య వదనం మే౭ద్య
గంతవ్యం వానరోత్తమ|
వర ఏష పురాదత్తో
మమ ధాత్రేతి సత్వరా|| 158


వానరోత్తమా!
ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించే ముందుకు సాగాలి.
పూర్వం బ్రహ్మ నాకు ఇచ్చిన వర మిది“.
వ్యాదాయ విపులం వక్త్రం
 స్థితా సా మారుతేః పురః|
ఏవ ముక్త స్సురసయా
క్రుద్ధో వానరపుంగవః|
అబ్రవీత్ కురు వై వక్త్రం
యేన మాం విషహిష్యసే|| 159

 
అంటూ నోటిని విశాలంగా తెఱచి,
హనుమంతుని ముందు నిలిచింది.
అంత హనుమంతుడు కోపించి,
అయితే నన్ను మ్రింగకలిగేటట్లు నోరు తెఱు .
ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో
దశయోజనమాయతః|| 160
అని, పది యోజనాల* వెడల్పు,
అంతే ఎత్తు పెరిగాడు.

 
దశయోజనవిస్తారో
బభూవ హనుమాం స్తదా|
తం దృష్ట్వా మేఘసంకాశం
దశయోజన మాయతమ్|| 161


పది యోజనాల వైశాల్యంతో ఎదిగి,
మేఘంలాఉన్న
ఆయనను చూచి,
చకార సురసా చాస్యం
వింశ ద్యోజనమాయతమ్|
హనుమాంస్తు తతః క్రుద్ధః
త్రింశ ద్యోజనమాయతః|| 162
సురస తన నోటిని
ఇరవై యోజనాలకు పెంచింది.
అంత హనుమంతుడు క్రుద్ధుడై,
ముప్పై యోజనాలకు పెరిగాడు.


చకార సురసా వక్త్రం
చత్వారింశత్ తథోచ్ఛ్రితమ్|
బభూవ హనుమాన్ వీరః
పంచాశ ద్యోజనోచ్ఛ్రితః || 163
అప్పుడు సురస, తన నోటిని
నలబై యోజనాలకు విస్తరించగా,
హనుమంతుడు
ఏబై యోజనాలకు పెరిగాడు.


చకార సురసా వక్త్రం
షష్టియోజన మాయతం|
తథైవ హనుమాన్ వీరః
సప్తతీయోజనోచ్ఛ్రితః|| 164 
సురస, తన నోటిని
అరవై యోజనాలకు విస్తరించగా,
హనుమంతుడు,
డెబ్బై యోజనాలకు పెరిగాడు.


చకార సురసా వక్త్రం
అశీతీయోజ నాయతం|
హనుమా నచలప్రఖ్యో
నవతీయోజనోచ్ఛ్రితః|| 165
సురస తన నోటిని
ఎనబై యోజనాలకు విస్తరించగా,
హనుమంతుడు,
తొంబై యోజనాలకు కొండలా పెరిగాడు.


చకార సురసా వక్త్రం
శతయోజన మాయతమ్|
తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం
వాయుపుత్త్ర స్సుబుద్ధిమాన్|| 166
దీర్ఘజిహ్వం సురసయా
సుఘోరం నరకోపమమ్|
సుసంక్షిప్యాత్మనః కాయం
బభూ వాంగుష్ఠమాత్రకః|| 167
సురస, తన నోటిని
వంద యోజనాలకు విస్తరించింది.
బుద్ధిమంతుడైన వాయుపుత్త్రుడు,
దీర్ఘమైన నాలుకతో,
ఘోర నరకప్రాయంగా
ఉన్నఆ నోటిని చూచి,
తన కాయాన్ని సంక్షిప్తంగా చేసి,
అంగుష్ఠ*మాత్రుడయ్యాడు.


సో౭భిపత్యాశు తద్వక్త్రం
నిష్పత్య చ మహాజనః|
అంతరిక్షే స్థితః శ్రీమాన్
ఇదం వచన మబ్రవీత్|| 168
గొప్ప వేగం కల ఆ మారుతి,
తటాలున ఆ సురస నోటిలోకి ప్రవేశించి,
వెంటనే బయటకు వచ్చి.
ఆకాశంలో నిలిచి, సురసతో అన్నాడు.


ప్రవిష్టో౭స్మి హి తే వక్త్రం
దాక్షాయణి నమో౭స్తుతే|
గమిష్యే యత్ర వైదేహీ
సత్యం చాసీద్వరస్తవ|| 169    
ఓ దాక్షాయణీ! నీకు నమస్కారం.
నీ నోట ప్రవేశించాను.
ఇక సీత కడకు వెళ్తాను.
నీ వరం నిజమైంది కదా!









------------------------------------------------------------------------------------------------
యోజనం = నాలుగు కోసులు. కోసు అనగా రెండు మైళ్లు.

అంగుష్ఠం = బ్రొటనవ్రేలు. అంగుష్ఠమాత్రుడంటే బ్రొటనవ్రేలంత పరిమాణం కలవాడు.






























శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: