10, జూన్ 2011, శుక్రవారం

అకారాది తెలుగు సినీ భక్తి గీతాలు - 1

తెలుగు నిఘంటువు ప్రకారం

అకారాది క్రమంగా పాటలను ( అక్షరానికి ఒకటి )

సేకరించి, అందరికీ వినిపిస్తే బాగుంటుందనిపించింది.

మొదట భక్తిగీతాలతో మొదలుపెడుతున్నాను.

అయితే,

అం, అ, ఆం, ఆ, ఇం, ఇ, ఈం, ఈ, ఉం, ఉ, ఊ, ఋ,

ఎం, ఎ, ఏ, ఐం, ఐ, ఒం, ఒ, ఓం, ఓ, ఔ - ఈ అచ్చులలో

అం, అ, ఆం, ఆ, ఇం, ఇ, ఈ, ఎం, ఎ, ఏ, ఐ, ఒ, ఓం, ఓ, లతో

మొదలయ్యే పాటలే దొరికాయి.

మిగిలినవి ఎవరైనా దయామతులైన సంగీతప్రియులు సూచిస్తే,

కళ్లకద్దుకొని చేరుస్తానని మనవి చేస్తున్నాను.


దొరికిన వాటిలోంచి, ఏరి, (నాకు నచ్చినవి) గుది గుచ్చి, ఒక దండగా తయారుచేశాను.

ఈ పాటలను విన్న ఔత్సాహికులు, (ఉత్సాహవంతులు)

ఆనందించిన మీదట, సూచనలు చెయ్యమని మనవి.










పాటలన్నీ పూర్తిగా వినడానికి మీకు సమయం ఉండచ్చు ఉండకపోవచ్చని ,

కేవలం పల్లవులను మాత్రమే ఉంచి, వినిపిస్తున్నాను.




శుభం భూయాత్

2 కామెంట్‌లు:

కాంత్ చెప్పారు...

పాటలన్నీ చాలా మంచివి సేకరించారు. ఇలాగే మరికొన్నీ అందించండి. ఒక చిన్న సవరణ. సప్తపదిలోని "అయిగిరి నందిని" - "ఐ" అక్షరంతో మొదలవదు.

నాగస్వరం చెప్పారు...

కేకే గారికి నమస్తే.
మీ ప్రశంసకు కృతజ్ఞతలు.
మీరు చెప్పింది నిజమే.
" అయిగిరినందిని " స్తోత్రంలో ఛందస్సు ప్రకారం అయితే అయి అనే ఉండాలి.
ఐ కాదు. ఐతే రెంటికీ సంబోధనే అర్థం.
అయితే ( ఐతే ) తెలుగుకు సంబంధించి,
"పెక్కుపట్ల తత్సమేతరపదములలోని, 'ఐ' కారమునకు 'అయి'
'అయి' కి 'ఐ' కారమును వికల్పముగా వచ్చును. - అహోబలపండితీయం.
ఐదు - అయిదు ; కైదువు - కయిదువు మొదలైనవి.
అందువల్ల 'ఐ' తో పాటలు లేక దాన్ని తీసుకోవడం జరిగింది.
నాగస్వరాన్ని ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.