1, మే 2012, మంగళవారం

రామసుందరం - 3




నిష్ర్పమాణశరీరస్సన్                                        అపరిమితంగా శరీరాన్ని పెంచి,      
లిలంఘయిషురర్ణవం |                                     మహేంద్రపర్వతాన్ని        
బాహుభ్యాం పీడయామాస                               చేతులతోనూ, కాళ్లతోనూ మర్దించాడు.
చరణాభ్యాం చ పర్వతమ్ || 11 ||


స చచాలాచలశ్చాపి                                         అచలమైనప్పటికీ ఆ పర్వతం
ముహూర్తం కపిపీడితః |                                   ముహూర్తం* సేపు కదిలింది.
తరూణాం పుష్పితాగ్రాణాం                                దాంతో పుష్పించియున్న
సర్వం పుష్పమశాతయత్ || 12 ||                      వృక్షాల పూలన్నీ రాలాయి. 



తేన పాదపముక్తేన                                           రాలిన, సుగంధభరితమైన ఆ పూలతో
పుష్పౌఘేణ సుగంధినా |                                   పర్వతమంతా నిండిపోయి,
సర్వతస్సంవృతశ్శైలో                                       ఒక పూలకొండలా ప్రకాశించింది.
బభౌ పుష్పమయో యథా || 13 ||


తేన చోత్తమవీర్యేణ                                           (మావటివానిచే) పీడింపబడిన ఏనుగు 
పీడ్యమానస్స పర్వతః |                                     ఎక్కువ మదజలం* విడిచినట్లు,
సలిలం సంప్రసుస్రావ                                        హనుమచే పీడింపబడిన ఆ పర్వతం
మదం మత్త ఇవ ద్విపః || 14 ||                           తన సెలయేళ్ల వల్ల ఎక్కువ జలాన్ని విడిచింది.
 
       
పీడ్యమానస్తు బలినా                                        బంగారు ఱాళ్లు, నీలంపు ఱాళ్లు,
మహేంద్ర స్తేన పర్వతః |                                     వెండి ఱాళ్లు పగిలి, 
రీతీ ర్నిర్వర్తయామాస                                      వాని రేఖలు కనిపించాయి. 
కాంచనాంజనరాజతీః || 15 ||


ముమోచ చ శిలాశ్శైలో                                    సప్తజ్వాల*ల్లో మధ్యదైన
విశాలాస్సమనశ్శిలాః |                                     ధూమ్రవర్ణ అనే జ్వాలతో కూడిన నిప్పు*నుండి
మధ్యమేనార్చిషా జుష్టో                                     పొగలు వెలువడినట్లు ఆ పర్వతం నుండి
ధూమరాజీరివానలః || 16 ||                               పొగలాంటి (నల్లని) ఱాళ్లు బయటపడ్డాయి.


గిరిణా పీడ్యమానేన                                          గిరిగుహల్లో నివసిస్తున్న భూతాలు (ప్రాణులు)
పీడ్యమానాని సర్వతః |                                      వికృతస్వరాలతో గగ్గోలు పెట్టాయి.
గుహావిష్టాని భూతాని
వినేదుర్వికృతైస్స్వరైః || 17 ||


స మహాసత్వ్తసన్నాద                                       ఆ ఆక్రందన ధ్వనులు భూమి అంతా నిండాయి.
శ్శైలపీడానిమిత్తజః |                                          దిశ*లందూ, ఉపవనాలందూ వ్యాపించాయి.
పృథివీం పూరయామాస
దిశశ్చోపవనాని చ || 18 ||


శిరోభిః పృథుభిస్సర్పా                                       సర్పాలు* కలతపడి,
వ్యక్తస్వస్తికలక్షణైః |                                           (కోపంతో) శిలలను కాటువేశాయి.
వమంతః పావకం ఘోరం
దదంశు ర్దశనైశ్శిలాః || 19 ||


తా స్తదా సవిషైర్దష్టాః                                         కాటుకులోనైన ఆ గండశిలలు
కుపితైస్తైర్మహాశిలాః |                                        విషాగ్నికీలలతో మండుతూ,
జజ్వలుః పావకోద్దీప్తా                                        వేయి తునకలుగా పగిలాయి.
బిభిదుశ్చ సహస్రథా || 20 ||


యాని చౌషధజాలాని                                        (అన్నిరకాల) విషాలను హరించే ఔషధాలు
తస్మిన్ జాతాని పర్వతే |                                    ఆ పర్వతం మీద ఉన్నా,
విషఘ్నాన్యపి నాగానాం                                    ఆ సర్పాల ఘోరవిషాన్ని మాత్రం
న శేకు శ్శమితుం విషమ్ || 21 ||                        హరింపలేకపోయాయి.


   
భిద్యతే౭యం గిరిర్భూతై                                    (పంచ) భూతాలచే ఈ కొండ పగులకొట్టబడుతోంది
రితి మత్వా తపస్వినః |                                     అని తలచి, తాపసులు కలతచెందారు.
త్రస్తా విద్యాధరా స్తస్మా                                       విద్యాధరులు* భయపడి, తమ స్త్రీలతో
దుత్పేతుః స్త్రీగణైస్సహ || 22 ||                            ఆకాశానికి ఎగిరిపోయారు.


పానభూమిగతం హిత్వా                                   ఆ విద్యాధరులు, బంగారంతో చేసిన
హైమమాసవభాజనం |                                     పాన, భోజన పాత్రలను, కలశాలను
పాత్రాణి చ మహార్హాణి
కరకాంశ్చ హిరణ్మయాన్ || 23 ||


లేహ్యానుచ్చావచాన్భక్ష్యాన్                                లేహ్యా*లను, భక్ష్యా*లను, ఫలాలను,
మాంసాని వివిధాని చ |                                     డాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గాలను
ఆర్షభాణి చ చర్మాణి                                          అక్కడే విడిచిపెట్టి ఎగిరిపోయారు.
ఖడ్గాంశ్చ కనకత్సరూన్ || 24 ||


కృతకంఠగుణాః క్షీబా                                        కంఠహారాలు, ఎఱ్ఱని పూలమాలలు,
రక్తమాల్యానులేపనాః |                                     రక్తచందనాలు ధరించిన,
రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ                                      ఎఱ్ఱనికండ్లుగల ఆ విద్యాధరులు
గగనం ప్రతిపేదిరే || 25 ||                                    ఆకాశానికి చేరారు. 


హారనూపుర కేయూర                                      హారాలు, అందెలు, కేయూరాలు, కంకణాలు
పారిహార్యధరాః స్త్రియః |                                      ధరించిన విద్యాధర స్త్రీలు,
విస్మితా స్సస్మితా స్తస్థు                                    విస్మితులై, సస్మితులై, భర్తలతో కూడి,
రాకాశే రమణైస్సహ || 26 ||                               ఆకాశాన నిలిచారు.


దర్శయంతో మహావిద్యాం                                 విద్యాధరమహర్షులు
విద్యాధరమహర్షయః |                                       నిరాధారంగా ఆకాశంలో ఉండటం అనే
సహితా స్తస్థురాకాశే                                          మహావిద్యను ప్రదర్శిస్తూ,
వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ || 27 ||                          పర్వతాన్ని చూస్తూ,


శుశ్రువుశ్చ తదా శబ్ద                                       నిర్మలాకాశంలో
మృషీణాం భావితాత్మనాం |                               భావితాత్ములైన ఋషుల*,
చారణానాం చ సిద్ధానాం                                    చారణుల, సిద్ధుల* మాటలను విన్నారు.
స్థితానాం విమలే(అ)ంబరే || 28 ||


ఏష పర్వతసంకాశో                                           పర్వతాకారుడు, మహావేగం గలవాడు,
హనూమాన్ మారుతాత్మజః |                            వాయునందనుడైన హనుమంతుడు
తితీర్షతి మహావేగః                                            మకరాలయమైన (మొసళ్లకు నిలయమైన)
సముద్రం మకరాలయమ్ || 29 ||                       సముద్రాన్నిదాట గోరుతున్నాడు.


రామార్థం వానరార్థం చ                                      రామునికొఱకు, వానరుని (సుగ్రీవుని) ప్రయోజనంకొఱకు
చికీర్షన్ కర్మ దుష్కరం |                                     ఎవరికీ చేయనలవిగాని పని చేయగోరి,
సముద్రస్య పరం పారం                                      దాటనలవిగాని సముద్రపు ఆవలిగట్టుకు
దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి || 30 ||                         చేర గోరుతున్నాడు.



----------------------------------------------------------------------------------------------------




* ముహూర్తం - 12 క్షణాల కాలం అనీ,  రెండు గడియల కాలం అనీ అర్థాలు.
గడియ అంటే 24 నిమిషాలు. రెండు గడియలు అంటే 48 నిమిషాలు.


* మదజలం - ఏనుగు శరీరం నుండి ద్రవరూపంలో కారే క్రొవ్వు.
ఏనుగుకు ఈ మదం ఎనిమిది చోట్ల పుడుతుంది. వీటికి వేర్వేఱు పేళ్లున్నాయి.
చెక్కిళ్ల పుట్టేది దానం. కన్నుల పుట్టేది సీధువు. చెవుల పుట్టేది సాగరం.
తొండము చివర పుట్టేది శీకరం. చనుమొనల పుట్టేది శిక్యం.
మేహనమున పుట్టేది మదం. హృదయాన పుట్టేది ఘర్మం. చరణాల పుట్టేది మేఘం.


* సప్తజ్వాలలు - ఏడు జ్వాలలు.
అగ్నిదేవుని నాలుకలు.
వాటి పేళ్లు వరుసగా
కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ.
వీటిలోమధ్యదైన ధూమ్రవర్ణ నుండి ధూమం బయలుదేరుతుంది.


*  నిప్పు - అగ్ని.
శుచిష్మతి విశ్వానరుల తనయుడు. వైశ్వానరుడు అసలు పేరు.
తపమున శివుని మెప్పించి, ఆయన వరంతో అగ్నిలోకానికి అధిపతి అయ్యాడు.
ఆగ్నేయదిక్కుకు అధిపతి.
అన్ని యజ్ఞాల్లోనూ హవిస్సులను దేవతలకు కొనిపోయేది ఈయనే.
(భృగుశాపంతో) సర్వభక్షకుడైనా, (విష్ణువరంతో) అత్యంత శుచి అయినవాడు.
స్వాహాదేవి ఈయన భార్య.


* దిశలు - దిక్కులు.
వరుసగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నిరృతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం.
ఇవి ఎనిమిది. భూమ్యాకాశాలతో కలిపి పది దిక్కులు.


* సర్పాలు - చరించేవి అని వ్యుత్పత్తి. పాములు.


* విద్యాధరులు - ఒక దేవజాతి.
గుటికాంజనాది విద్యలను ధరించినవారు అని వ్యుత్పత్తి.
జీమూతవాహనుడు మొదలైనవారు విద్యాధరులు.


* లేహ్యాలు - నాకి భుజింపదగిన వ్యంజన విశేషాలు.


* భక్ష్యాలు - తినదగినవి.
పంచభక్ష్యాలు అంటారు. అవి భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.


*  ఋషులు - జ్ఞానం యొక్క ఆవలిఒడ్డుకు చేరినవారు.


* సిద్ధులు - అణిమాది సిద్ధులు కలవారు.
"అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట భూతయః."
ఈ ఎనిమిదింటినే అష్టైశ్వర్యములని కూడా అంటారు.


----------------------------------------------------------------------------------------------------


ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం || 2 ||











శుభం భూయాత్