2, మే 2012, బుధవారం

రామసుందరం - 4




ఇతి విద్యాధరాశ్శ్రుత్వా                                     ఆ మహాత్ముల మాటలను విని,
వచస్తేషాం మహాత్మనాం |                                  విద్యాధరులు, అప్రమేయుడైన
తమప్రమేయం దదృశుః                                   ఆ వానరోత్తముని చూశారు.
పర్వతే వానరర్షభమ్ || 31 ||

   
దుధువే చ స రోమాణి                                      కొండంతటి హనుమంతుడు
చకంపే చాచలోపమ: |                                      వెండ్రుకలను విదిల్చాడు.
ననాద సుమహానాదం                                     అటూ ఇటూ కదిలాడు.
సుమహానివ తోయద: || 32 ||                           గొప్ప మేఘంలా మహానాదం చేశాడు.


ఆనుపూర్వ్యేణ వృత్తం చ                                  ఎగరడానికి సన్నద్ధుడై, ఆఁదోక*గా ఉండి,           
లాంగూలం లోమభిశ్చితం |                             వెండ్రుకలతో నిండిన తన వాలాన్ని(తోకను)
ఉత్పతిష్యన్ విచిక్షేప                                        గరుత్మంతుడు వ్యాళాన్ని(పామును)
పక్షిరాజ ఇవోరగమ్ || 33 ||                               విదలించినట్లు విదిలించాడు.


తస్య లాంగూల మావిద్ధ                                  ఆ మహావేగవంతుని వెనుక       
మాత్తవేగస్య పృష్ఠతః |                                      వంకరగా వ్రేలాడే ఆ లాంగూలం(తోక)    
దదృశే గరుడేనేవ                                           గరుత్మంతునిచే తీసుకొనిపోయే
హ్రియమాణో మహోరగః || 34 ||                      మహాసర్పంలా కనబడింది.


బాహూ సంస్తంభయామాస                            గొప్ప పరిఘ*ల్లాంటి తన బాహువుల్ని స్తంభింపజేసి,
మహాపరిఘసన్నిభౌ |                                    ఊపిరిని ఊర్ధ్వముఖంగా బిగపట్టి,
ససాద చ కపిః కట్యాం                                     నడుమును సన్నగా చేసి,
చరణౌ సంచుకోచ చ || 35 ||                            పాదాలను ముడుచుకొని,


సంహృత్య చ భుజౌ శ్రీమాన్                            భుజాలను, మెడను బిగపట్టి,
తథైవ చ శిరోధరాం |                                      తనకున్న తేజం, బలం, వీర్యం
తేజస్సత్త్వం తథా వీర్య                                   అంతటినీ పూని,
మావివేశ స వీర్యవాన్ || 36 ||                         (సకల శక్తుల్నీ కేంద్రీకరించి)


మార్గమాలోకయన్ దూరా                               దూరంగా వెళ్లాల్సిన మార్గాన్ని చూస్తూ,
దూర్ధ్వం ప్రణిహితేక్షణః |                                   ఊర్ధ్వంగా దృష్టిని ఉంచి,
రురోధ హృదయే ప్రాణా                                    ఆకాశాన్ని చూస్తూ,
నాకాశ మవలోకయన్ || 37 ||                          హృదయాన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలను బిగపట్టి,


పద్భ్యాం దృఢమవస్థానం                                పాదాల్ని నేలపై దృఢంగా మోపి,
కృత్వా స కపికుంజరః |                                    చెవుల్ని రిక్కించి,
నికుంచ్య కర్ణౌ హనుమా                                  పై కెగరడానికి సన్నద్ధుడై,
నుత్పతిష్య న్మహాబలః || 38 ||


వానరా న్వానరశ్రేష్ఠ                                        ఆ వానర శ్రేష్ఠుడు, వానరులతో,
ఇదం వచనమబ్రవీత్ |                                    " రాముడు విడచిన బాణం
యథా రాఘవనిర్ముక్తః                                    వాయువేగంతో వెళ్లినట్లు,
శరః శ్వసనవిక్రమః || 39 ||                                మిక్కిలి వేగంతో


గచ్ఛేత్ తద్వద్గమిష్యామి                                  నేను, రావణపాలిత లంక*కు వెళ్తాను.
లంకాం రావణపాలితాం |                                  అక్కడ జానకిని చూడనేని,
నహి ద్రక్ష్యామి యది తాం                
లంకాయాం జనకాత్మజామ్ || 40 ||


అనేనైవ హి వేగేన                                            అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను.
గమిష్యామి సురాలయం |                                 అక్కడ కూడా సీతను చూడనిచో,
యది వా త్రిదివే సీతాం
న ద్రక్ష్యా మ్యకృతశ్రమ: || 41 ||


బద్ద్వా రాక్షసరాజాన                                         రావణుని బంధించి, తీసుకొని వస్తాను.
మానయిష్యామి రావణం |                                 ఏదేమైనా, ఏవిధంగానైనా కృతకృత్యుడనై,
సర్వథా కృతకార్యో౭హ                                      సీతతో సహా తిరిగి వస్తాను.
మేష్యామి సహ సీతయా || 42 ||


ఆనయిష్యామి వా లంకాం                                  లేకపోతే, రావణునితో సహా
సముత్పాట్య సరావణాం |                                  లంకను పెల్లగించి, తీసుకొని వస్తాను".
ఏవముక్త్వా తు హనుమాన్                              అని, పలికి,
వానరాన్ వానరోత్తమః || 43 ||


ఉత్పపాతాథ వేగేన                                            ఎట్టి విచారం లేకుండా,
వేగవానవిచారయన్ |                                        వేగంగా ఆకాశానికి ఎగిరాడు.
సుపర్ణమివ చాత్మానం                                       అపుడు ఆయన తనను
మే న స కపికుంజరః || 44 ||                                సుపర్ణుని*లా భావించుకొన్నాడు.


సముత్పతతి తస్మిం స్తు                                    ఆయన ఎగరగానే,
వేగాత్తే నగరోహిణః |                                           ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ
సంహృత్య విటపాన్ సర్వాన్                               తమ కొమ్మలతో సహా
సముత్పేతుస్సమంతతః || 45 ||                          ఆకాశానికి ఎగిరాయి.


స మత్తకోయష్టిబకాన్                                        మదించిన కొక్కెరలు, పుష్పాలు
పాదపాన్ పుష్పశాలినః |                                     కలిగిన ఆ వృక్షాల్ని                 
ఉద్వహన్నూరువేగేన                                        తన తొడలవేగంతో వెంట తీసుకొనిపోతూ,
జగామ విమలే(అ)ంబరే || 46 ||                        నిర్మలాకాశంలో పురోగమించాడు.


ఊరువేగోద్ధతా వృక్షా                                         సుదీర్ఘయాత్రకు బయలుదేరిన బంధువును వీడ్కొల్పటానికి
ముహూర్తం కపిమన్వయుః |                            మిగిలినవారు కొంతదూరం అనుసరించినట్లు,
ప్రస్థితం దీర్ఘమధ్వానం                                      వృక్షాలన్నీ ముహూర్తకాలం
స్వబంధుమివ బాంధవాః || 47 ||                        ఆయనను వెంబడించాయి.


తమూరువేగోన్మథితా                                       ఆయన ఊరువేగధాటికి పెల్లగించబడిన
స్సాలాశ్చాన్యే నగోత్తమాః |                                 సాలవృక్షాలు మొదలైన మహావృక్షాలు
అనుజగ్ముర్హనూమంతం                                   సైన్యాలు మహారాజునులా
సైన్యా ఇవ మహీపతిమ్ || 48 ||                         హనుమంతుని అనుసరించాయి.


సుపుష్పితాగ్రైర్బహుభిః                                    బాగా పుష్పించిన
పాదపైరన్వితః కపిః |                                         బహు వృక్షాలనడుమ ఉండి,
హనుమాన్ పర్వతాకారో                                   ఆ హనుమంతుడు
బభూవాద్భుతదర్శనః || 49 ||                            చూసేవారికి ఆశ్చర్యం కలిగించాడు.


సారవంతో౭థ యే వృక్షా                                    దేవేంద్రునికి భయపడి,
న్యమజ్జన్  లవణాంభసి |                                   పర్వతాలు, సముద్రంలో దాక్కొన్నట్లు*,
భయాదివ మహేంద్రస్య                                     (ముందుగా) బరువుగల చెట్లన్నీ
పర్వతా వరుణాలయే || 50 ||                             సముద్రంలో పడి, మునిగిపోయాయి.



-----------------------------------------------------------------------------------------------------




* ఆఁదోక - ఆవుతోక. మొదట లావుగా, వర్తులాకారంగా నుండి, క్రమక్రమంగా సన్నబడిన ఆకృతి.

* పరిఘ - ఇనుప గుదియ.
నాలుగుమూరల నిడివి గల దండం.

* లంక - విశ్వకర్మ అనే దేవశిల్పి,
మాల్యవదాదుల కోరిక మీద పసిడిభవనాలతో
నిర్మించిన సుందరనగరం.
పిదప కుబేరుని స్వాధీనమైంది.
ఆ తరువాత రావణుడు దాన్ని ఆక్రమించుకొన్నాడు.

* సుపర్ణుడు - మంచిఱెక్కలు గలవాడు అని వ్యుత్పత్తి.
గరుత్మంతుడు.
వినత కశ్యపులకు జన్మించిన వాడు.
పుట్టగానే ఆకాశాని కెగిరి, తిరిగి వచ్చినవాడు.
మాతృభక్తి కలవాడు.
అనూరుడు ఇతని సోదరుడు
ఇతనికి విష్ణువే స్వయంగా తనకు వాహనమయ్యేలా వరం ఇచ్చాడు.

* వివరణ - పర్వతాలు ప్రజాపతి సంతానం.
వాటికి మొదట ఱెక్కలు ఉండేవి.
అవి తమ ఇచ్ఛవచ్చినచోటుకు ఎగిరిపోయి,
వ్రాలుతూండటంతో ప్రజలకు, భూమికి బాధలు కలుగుతూండేవి.
దాంతో ఇంద్రుడు వాటి ఱెక్కలు తెగగొట్టాడు.
ఈ ఱెక్కలే మేఘాలయ్యాయి.

---------------------------------------------------------------------------------------------------



సాసితూణధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం || 3 ||







శుభం భూయాత్

2 కామెంట్‌లు:

Dr.R.P.Sharma చెప్పారు...

నాగస్వరం గారికి నమస్కారములు.

మీ బ్లాగ్ చూసాను. చాలా బాగుంది. సులువైన భాషలో భావం తో ఆకట్టుకునేట్టు ఉంది. నేనుకూడా రామాయణానికి సంబంధించి మరొక ఉద్దేశంతో ఒక బ్లాగ్ ప్రారంభించాను.

రామాయణాన్ని మొత్తాన్ని పటించి, రికార్డ్ చేసి, వాటిని బ్లాగ్ లో పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే, రామాయణం పారాయణం చేద్దామనుకున్నావారికి పుస్తకం ముందుంచుకొని, ఈ ఆడియో వింటూ సులువుగా పాఠం చేసుకోగలగాలి.నేను కూడా సుందరకాండతో ప్రారంభించాను. దానిని ఈ కింది లింక్ లో చూడవచ్చు.
http://sanskritcentral.com/ramayanam/sundarakanda
ప్రస్తుతానికి ఎనిమిది సర్గలు మాత్రమే అక్కడ పెట్టాను. అయితే, ఆ రికార్డింగ్ నాకు పూర్తి సంతృప్తి కలిగించలేదు. ఇంకా నిదానంగా చదవాలి. ఆడియోలో రణగొణధ్వనులు తగ్గాలి అనుకుంటున్నాను. అందుకే ప్రస్తుతం ఆపేసాను. ఇంకా మిత్రులు ఇచ్చే సూచనలను కూడా స్వీకరిస్తాను. మరొక వారం తర్వాత నేననుకునే లక్ష్యంతో పునఃప్రారంభం చేస్తాను. మనలో మాట మీ పోష్టింగ్ లో ఈ ఆడియోను వినియోగించుకోవచ్చు.

నాగస్వరం చెప్పారు...

చాల సంతోషం. శర్మగారూ!
మీలాంటివారు మెచ్చుకోవడం
నాకు కొండంతబలాన్ని ఇచ్చింది.
మొదలుపెట్టడమైతే మొదలుపెట్టాను కానీ
"సముద్రాన్ని ఒక్క యోజనం మాత్రమే దాటగలను"
అన్న ఒక వానరుని పనిలా ఉంది
ఇప్పుడు నా పరిస్థితి.
మీవంటి సంస్కృతపండితులను
మెప్పిస్తూనూ, కోపం తెప్పించకుండానూ
పూర్తిచేయగలనా? అన్న భయం పట్టుకుంది ఇప్పుడు.
మీలాంటి వారి అండ ఉండాలి.
మీ ఆడియో సుందరకాండ విన్నతదుపరి
నా అభిప్రాయాన్ని తెలియజేయగలవాడను.

కృతజ్ఞతలతో..