సుందరకాండ - షష్ఠస్సర్గము
రావణాదుల భవనాల్లో
ఆంజనేయుడు సీతను అన్వేషించుట
స నికామం విమానేషు
విషణ్ణః కామరూపధృక్ |
విచచార పునర్లంకాం
లాఘవేన సమన్వితః || 1
|
హనుమంతుడు,
రావణుని గృహాల్లో
ఎక్కడా సీత జాడ కానక, ఎంతో
విచారించాడు.
మరల జాగరూకుడై, లాఘవంతో లంకంతా వెదకడం మొదలుపెట్టాడు.
|
ఆససాదాథ లక్ష్మీవాన్
రాక్షసేంద్రనివేశనమ్ |
ప్రాకారేణార్కవర్ణేన
భాస్వరేణాభిసంవృతమ్ || 2
|
సూర్యకాంతితో
ప్రకాశిస్తున్న
ప్రాకారం
కల
రావణుని ప్రాసాదాన్ని
సమీపించాడు.
|
రక్షితం రాక్షసైర్ఘోరైః
సింహైరివ
మహద్వనమ్ |
సమీక్షమాణో
భవనం
చకాశే కపికుంజరః || 3
|
సింహరక్షితవనంలా,
భయంకరరాక్షసుల
కాపలాలో ఉన్న
ఆ భవనాన్ని
చూచి,
ఆశ్చర్యపడ్డాడు.
|
రూప్యకోపహితైశ్చిత్రైః
తోరణైర్హేమభూషితైః |
విచిత్రాభిశ్చ
కక్ష్యాభిః
ద్వారైశ్చ
రుచిరైర్వృతమ్ || 4
|
దానికి వెండిబంగారాలతో
నిర్మించిన
తోరణాలు, చిత్రవిచిత్ర అంతస్తులు,
అందమైన ద్వారాలు
ఉన్నాయి.
|
గజాస్థితైర్మహామాత్రైః
శూరైశ్చ విగతశ్రమైః |
ఉపస్థితమసంహార్యైః
హయైస్స్యందనయాయిభిః || 5
|
ఆ భవనసమీపంలో
మదపుటేనుగులపై
శూరులున్నారు.
అశ్వారూఢులు, రథారూఢులు సర్వసన్నద్ధులై ఉన్నారు.
|
సింహవ్యాఘ్రతనుత్రాణైః
దాంతకాంచనరాజతైః |
ఘోషవద్భిర్విచిత్రైశ్చ
సదా విచరితం
రథైః || 6
|
దంతాలు, వెండి, బంగారాలతో
నిర్మింపబడిన రథాలు
అటూ ఇటూ తిరుగుతున్నాయి.
వాటిలో సింహవ్యాఘ్రచర్మాలతో
చేసిన
కవచాలున్నాయి.
|
బహురత్నసమాకీర్ణం
పరార్థ్యాసనభాజనమ్ |
మహారథసమావాసం
మహారథమహాస్వనమ్ || 7
|
రత్నాలంకృతమైన
ఆ భవనంలో
ఆసనాలు, పాత్రలు ఉన్నాయి.
మహారథులున్నారు.
మహారథాలు
చేస్తున్న ధ్వనులున్నాయి.
|
దృశ్యైశ్చ
పరమోదారైః
తైస్తైశ్చ
మృగపక్షిభిః |
వివిధైర్బహుసాహస్రైః
పరిపూర్ణం
సమంతతః || 8
|
వేలసంఖ్యలో
అందమైన
జింకలు, పక్షులు ఉన్నాయి.
|
వినీతైరంతపాలైశ్చ
రక్షోభిశ్చ
సురక్షితమ్ |
ముఖ్యాభిశ్చ
వరస్త్రీభిః
పరిపూర్ణం
సమంతతః || 9
|
ఆ భవనం,
సుశిక్షితులతో
రక్షింపబడుతోంది.
వరస్త్రీలతో
పరిపూర్ణమై ఉంది.
|
ముదితప్రమదారత్నం
రాక్షసేంద్రనివేశనమ్ |
వరాభరణసంహ్రాదైః
సముద్రస్వననిస్స్వనమ్ || 10
|
రావణనివాసంలో
వనితలు
ఆనందంలో ఓలలాడుతున్నారు.
వారి ఆభరణాల
మంజుల రవాలు
సముద్రపుటలలధ్వనుల్లా
మనోజ్ఞంగా
ఉన్నాయి.
|
తద్రాజగుణసంపన్నం
ముఖ్యైశ్చాగరుచందనైః
మహాజనై స్సమాకీర్ణం
సింహైరివ
మహద్వనమ్ || 11
|
ఆ భవనం,
ఛత్రాచామరాది
రాజచిహ్నాలతో,
అగరుచందనాదుల
పరిమళాలతో
అలరారుతోంది.
బలిష్ఠులతో
సింహవనంలా ఉంది.
|
భేరీమృదంగాభిరుతం
శంఖఘోషనినాదితమ్ |
నిత్యార్చితం
పర్వహుతం
పూజితం రాక్షసైస్సదా || 12
|
ఆ భవనంలో
భేరీమృదంగధ్వనులు, శంఖనాదాలు
మారుమ్రోగుతున్నాయి.
రాక్షసులతో
సర్వపర్వకాలాల్లో
అక్కడ హోమం
చేయబడుతోంది.
(అందఱికీ
సుఖకరమైంది)
పూజింపబడుతోంది.
(కావలి
ఉండటం వల్ల దుష్ప్రవేశమైంది)
|
సముద్రమివ
గంభీరం
సముద్రమివ
నిస్స్వనమ్ |
మహాత్మనో
మహద్వేశ్మ
మహారత్నపరిచ్ఛదమ్ || 13
|
ఆ భవనం సముద్రంలా
గంభీరమైనది.
(రావణభయంతో)
నిశ్శబ్దమైనది.
దాని పైకప్పును
గొప్పరత్నాలతో చేశారు.
|
మహారత్నసమాకీర్ణం
దదర్శ స మహాకపిః |
విరాజమానం
వపుషా
గజాశ్వరథసంకులమ్ || 14
|
భవనం నిండా
రత్నాలే.
అటువంటి రావణుని
గృహాన్ని
ఆంజనేయుడు
చూశాడు.
గజాశ్వరథాలు, మధురాకృతి గల
|
లంకాభరణమిత్యేవ
సో౭మన్యత
మహాకపిః |
చచార హనుమాంస్తత్ర
రావణస్య సమీపతః || 15
|
ఆ భవనం, లంకకే
ఆభరణమనుకొన్నాడు.
దాని సమీపంలో
సంచరించాడు.
|
గృహాద్గృహం
రాక్షసానామ్
ఉద్యానాని
చ వానరః |
వీక్షమాణో
హ్యసంత్రస్తః
ప్రాసాదాంశ్చ
చచార సః || 16
|
రాక్షసగృహాలను, ప్రాసాదాలను,
ఉద్యానవనాలను
క్రమక్రమంగా
వీక్షిస్తూ, నిర్భయంగా సంచరించాడు.
|
అవప్లుత్య
మహావేగః
ప్రహస్తస్య
నివేశనమ్ |
తతో౭న్యత్
పుప్లువే వేశ్మ
మహాపార్శ్వస్య
వీర్యవాన్ || 17
|
ఆయన అతివేగంతో,
ప్రహస్తుని
ఇంటికి,
అక్కడినుండి
మహాపార్శ్వుని
ఇంటికి వెళ్లాడు.
|
అథ మేఘప్రతీకాశం
కుంభకర్ణనివేశనమ్ |
విభీషణస్య
చ తదా
పుప్లువే
స మహాకపిః || 18
|
మేఘంలాంటి
కుంభకర్ణుని ఇంటికి,
విభీషణుని
ఇంటికి వెళ్లాడు.
|
మహోదరస్య
చ గృహం
విరూపాక్షస్య
చైవ హి |
విద్యుజ్జిహ్వస్య
భవనం
విద్యున్మాలేస్తథైవ
చ || 19
|
తర్వాత ఆయన, మహోదరుడు,
విరూపాక్షుడు,
విద్యుజ్జిహ్వుడు,
విద్యున్మాలుడు
|
వజ్రదంష్ట్రస్య
చ తథా
పుప్లువే
స మహాకపిః |
శుకస్య చ
మహాతేజాః
సారణస్య చ
ధీమతః || 20
|
వజ్రదంష్ట్రుడు,
శుకుడు,
సారణుడు - వీరిండ్లకు వెళ్లాడు.
|
తథా చేంద్రజితో
వేశ్మ
జగామ హరియూథపః |
జంబుమాలేస్సుమాలేశ్చ
జగామ హరిసత్తమః || 21
|
ఇంద్రజిత్తు,
జంబుమాలి,
సుమాలి ఇండ్లకు
వెళ్లాడు.
|
రశ్మికేతోశ్చ
భవనం
సూర్యశత్రోస్తథైవ
చ |
వజ్రకాయస్య
చ తథా
పుప్లువే
స మహాకపిః || 22
|
రశ్మికేతువు,
సూర్యశత్రువు,
వజ్రకాయుడు,
|
ధూమ్రాక్షస్య
చ సంపాతే:
భవనం మారుతాత్మజ: |
విద్యుద్రూపస్య
భీమస్య
ఘనస్య విఘనస్య
చ || 23
|
ధూమ్రాక్షుడు, సంపాతి,
విద్యుద్రూపుడు, భీముడు,
ఘనుడు, విఘనుడు,
|
శుకనాసస్య
వక్రస్య
శఠస్య వికటస్య
చ |
హ్రస్వకర్ణస్య
దంష్ట్రస్య
రోమశస్య చ
రక్షస: || 24
|
శుకనాసుడు, వక్రుడు,
శఠుడు, వికటుడు,
హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు
రోమశుడు,
|
యుద్ధోన్మత్తస్య
మత్తస్య
ధ్వజగ్రీవస్య
నాదిన: |
విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం
తథా హస్తిముఖస్య
చ || 25
|
యుద్ధోన్మత్తుడు, మత్తుడు,
ధ్వజగ్రీవుడు, నాది,
విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు,
హస్తిముఖుడు
|
కరాళస్య పిశాచస్య
శోణితాక్షస్య
చైవ హి |
క్రమమాణ: క్రమేణైవ
హనుమాన్ మారుతాత్మజ: || 26
|
కరాళుడు, పిశాచుడు,
శోణితాక్షుడు
మొదలైన రాక్షసుల ఇండ్లకు వరుసగా వెళ్లి,
శోధించాడు.
|
తేషు తేషు
మహార్హేషు
భవనేషు మహాయశా: |
తేషామ్ ఋద్ధిమతామ్
ఋద్ధిం
దదర్శ స మహాకపి: || 27
|
ఆ యా గృహాల్లో
సంచరిస్తూ,
వారి సంపదలను
వీక్షించాడు.
|
సర్వేషాం
సమతిక్రమ్య
భవనాని సమంతత: |
ఆససాదాథ లక్ష్మీవాన్
రాక్షసేంద్రనివేశనమ్ || 28
|
అన్ని భవనాలను
పూర్తిగా శోధించాక,
రావణుని ఇంటికి
వెళ్లాడు.
|
రావణస్యోపశాయిన్యో
దదర్శ హరిసత్తమ: |
విచరన్ హరిశార్దూలో
రాక్షసీర్వికృతేక్షణా: || 29
|
రావణుని సమీపంలో
శయనించిన,
వికృతచూపులుగల
రాక్షసస్త్రీలను చూశాడు.
|
శూలముద్గరహస్తాశ్చ
శక్తితోమరధారిణీ: |
దదర్శ వివిధాన్
గుల్మాన్
తస్య రక్ష:పతేర్గృహే || 30
|
వారు శూలాలు, గుదియలు, శక్తి,
తోమరాలు ధరించి ఉన్నారు.
ఇంకా అక్కడ
నానావిధసేనావిభాగాలను కూడా చూశాడు.
|
రాక్షసాంశ్చ
మహాకాయాన్
నానాప్రహరణోద్యతాన్
|
రక్తాన్ శ్వేతాన్
సితాంశ్చైవ
హరీంశ్చాపి
మహాజవాన్ || 31
|
వివిధాయుధాల్ని
ధరించిన మహాకాయుల్ని,
బంధించి ఉంచిన
ఎఱ్ఱని, తెల్లని, గొప్ప గమనవేగం కల గుఱ్ఱాల్ని చూశాడు.
|
కులీనాన్
రూపసంపన్నాన్
గజాన్ పరగజారుజాన్ |
నిష్ఠితాన్
గజశిక్షాయామ్
ఐరావతసమాన్
యుధి || 32
|
ఉత్తమజాతి, చక్కని ఆకారం, శత్రుగజాలను పీడించే సామర్థ్యం,
యుద్ధవిద్యలలో
సుశిక్షణ,
ఐరావతసామ్యం
కలిగిఉండి,
|
నిహంతౄన్
పరసైన్యానాం
గృహే తస్మిన్
దదర్శ స: |
క్షరతశ్చ
యథా మేఘాన్
స్రవతశ్చ
యథా గిరీన్ || 33
|
శత్రుసైన్యాల్ని
హతమార్చేవి,
వర్షిస్తున్న
మేఘాల్లా
ప్రవాహం కలిగిన
గిరుల్లా
మదజలం స్రవించేవి,
|
మేఘస్తనితనిర్ఘోషాన్
దుర్ధర్షాన్
సమరే పరై: |
సహస్రం వాహినీస్తత్ర
జాంబూనదపరిష్కృతా: || 34
|
మేఘగర్జనల్లా
ఘీంకరించేవి,
ఎదిరించ వీలులేనివి
అయిన
మదపుటేనుగుల్ని
చూశాడు.
బంగారు అలంకారాలు
|
హేమజాలపరిచ్ఛన్నా:
తరుణాదిత్యసన్నిభా: |
దదర్శ రాక్షసేంద్రస్య
రావణస్య నివేశనే || 35
|
బంగారు ఆభరణాలు
కలిగి,
మధ్యాహ్నసూర్యునిలాంటి
వేలసేనలను
చూశాడు.
|
శిబికా వివిధాకారా:
స కపిర్మారుతాత్మజ: |
లతాగృహాణి
చిత్రాణి
చిత్రశాలాగృహాణి
చ || 36
|
వివిధపల్లకీలు,
చిత్రమైన
పొదరిళ్లు,
చిత్రశాలలు,
|
క్రీడాగృహాణి
చాన్యాని
దారుపర్వతకానపి |
కామస్య గృహకం
రమ్యం
దివాగృహకమేవ
చ |
దదర్శ రాక్షసేంద్రస్య
రావణస్య నివేశనే || 37
|
క్రీడామందిరాలు,
దేవదారు వృక్షాలున్న
క్రీడాపర్వతాలు, కామగృహాలు,
దివాగృహాలు
చూశాడు.
(వెతికాడు)
|
స మందరగిరిప్రఖ్యం
మయూరస్థానసంకులమ్ || 38
|
ఆ రావణుని
భవనం,
మందరగిరిలా
బంగారుమయమై ఉంది.
క్రీడామయూరాలు,
|
ధ్వజయష్టిభిరాకీర్ణం
దదర్శ భవనోత్తమమ్ |
అనేకరత్నసంకీర్ణం
నిధిజాలం
సమంతత: || 39
|
ధ్వజపతాకాలు,
రత్నాలు,
నిధులు కలది.
|
ధీరనిష్ఠితకర్మాంతం
గృహం భూతపతేరివ |
అర్చిర్భిశ్చాపి
రత్నానాం
తేజసా రావణస్య
చ || 40
|
సదాశివునికైలాసంలా
దృఢవ్రతుల
తపఫలం అనదగ్గ
(కష్టపడి
నిపుణులు తయారుచేశారనుట)
రత్నకాంతులతో, రావణుని తేజస్సుతో
|
విరరాజాథ
తద్వేశ్మ
రశ్మిమానివ
రశ్మిభి: |
జాంబూనదమయాన్యేవ
శయనాన్యాసనాని
చ |
భాజనాని చ
ముఖ్యాని
దదర్శ హరియూథప: || 41
|
వెలుగుతూ,
చండకిరణుడైన
సూర్యునిలా ఉంది.
హనుమంతుడు
చూసిన ఆ రావణభవనాన
తల్పాలు, ఆసనాలు, ముఖ్యపాత్రలు
అన్నీ కాంచనమయమే.
|
మధ్వాసవకృతక్లేదం
మణిభాజనసంకులమ్ |
మనోరమమసంబాధం
కుబేరభవనం
యథా || 42
|
ఆ భవనం తేనె
మద్యాలతో తడిసింది.
మణులు పొదిగిన
పాత్రలు కలది.
కుబేరప్రాసాదంలా
విశాలంగా మనోహరంగా ఉంది.
|
నూపురాణాం
చ ఘోషేణ
కాంచీనాం
నినదేన చ |
మృదంగతలఘోషైశ్చ
ఘోషవద్భిర్వినాదితమ్ || 43
|
కాలి అందెల
సవ్వడులు,
ఒడ్డాణాల
రవళులు,
మృదంగనాదాలతో
మార్మ్రోగుతోంది.
|
ప్రాసాదసంఘాతయుతం
స్త్రీరత్నశతసంకులమ్ |
సువ్యూఢకక్ష్యం
హనుమాన్
ప్రవివేశ
మహాగృహమ్ || 44
|
పెక్కు మేడలు,
పెక్కువేలమంది
ఉత్తమస్త్రీలు,
మిక్కిలి
విశాలమైన తొట్టికట్లు(లోగిళ్లు)తో
ఒప్పే, ఆ రావణుని మహాగృహంలోకి
హనుమంతుడు
ప్రవేశించాడు.
|
ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠస్సర్గః (6)
శుభం
భూయాత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి