8, మే 2011, ఆదివారం

బ్లాగ్ మిత్రులకు విన్నపం

బ్లాగ్ మిత్రులందరికీ

వందనాల విన్నపం.

కూడలి, సంకలిని, హారం మొదలైన అగ్రిగేటర్లలో

బ్లాగ్ లన్ని చూశాను.

కొన్ని బ్లాగ్ ల పేర్లు ఇంగ్లీషులో ఉన్నాయి.

కన్ఫ్యూజింగ్ క్షమించండి తికమకగా ఉంది.

అందువల్ల బ్లాగ్ పేరును ఇంగ్లీషులో వ్రాసినవారు,

ఇంగ్లీషుపేరే పెట్టినవారు వాటిని తెలుగులో చూపించప్రార్థన.


ఉదా: gurukrupa ను గురుకృప గాను

crossroads ను క్రాస్ రోడ్స్ గాను మార్చ వేడుకోలు.

తర్వాత నేను నాగస్వరం అనే బ్లాగ్ ను కొత్తగా ప్రారంభించాను. నేనూ కొత్తే అనుకోండి.

దీనిలో కొన్ని బాగున్న బ్లాగులను చదివి, చిన్న విశ్లేషణతో నాగస్వరంలో వ్రాయదలచుకొన్నాను.

అంటే బ్లాగర్లకు ప్రచారమాధ్యమంలా నాగస్వరాన్ని ఉపయోగిద్దామని.

కాని అగ్రిగేటర్లు బ్లాగుల్లో విషయాల గురించి direct గాను indirect గాను ఏమీ వ్రాయవద్దంటున్నారు.

నేనేమీ వ్యతిరేకంగా వ్రాయను. బాగున్నవాటినే పేర్కొని బాగున్నాయంటానంతే.

మీ అందరి అనుమతి కోరుతున్నాను.

బహుశా తెలుగు బ్లాగ్ ప్రపంచంలో నా ప్రయత్నం మొదటిదా?

లేక ఎవరైనా ఇలా చేస్తున్నారా?

మీ సమాధానాలను బట్టి ప్రారంభిస్తాను.

మొదట ఇంగ్లీషు పేర్లు మాత్రం మార్చ మనవి.



మీవిధేయ
నాగస్వరం

2 కామెంట్‌లు:

శ్రీధర్ చెప్పారు...

నాగస్వరానికి తలలూపని సర్పాలు ఉంటాయా ? నాకు అంగీకారమే ! నా బ్లాగు పేరు క్షీరగంగ. చూసి మీ వ్యాఖ్య పెట్టండి.http://sridhar-ayala.blogspot.com/

కొత్త పాళీ చెప్పారు...

"కాని అగ్రిగేటర్లు బ్లాగుల్లో విషయాల గురించి direct గాను indirect గాను ఏమీ వ్రాయవద్దంటున్నారు."
మీబ్లాగులో మీరేం రాసుకోవచ్చో రాయకూడదో చెప్పడానికి అగ్రిగేటర్లు ఎవరు? ఏదైనా ఒక బ్లాగుగురించి సమీక్షో విశ్లేషణో చేస్తే, ఏదైనా కారణం ఉంటే ఆ సదరు బ్లాగరికి ఉండాలి ఏదైనా అభ్యంతరం ఉంటే? మధ్యలో అగ్రిగేటర్లకేమి చీమకుట్టింది?