5, మే 2011, గురువారం

బ్లాగ్ సోదర సోదరీమణులారా!

హాయ్ నేనొక క్రొత్త తెలుగు బ్లాగ్గర్ని . పరమోత్సాహంతో వచ్చాను . నాకు సంగీతమంటే ప్రాణం . అందులోను శాస్త్రీయ సంగీతం అంటే చాల ప్రియం . త్యాగయ్య , అన్నమయ కీర్తనలు ఎక్కువగా వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను . నేదునూరి గారు , సుబ్బలక్ష్మి గారు , త్యాగరాజ కృతులు పాడుతుంటే ఆనందమే వేరు. విని పరవశిస్తూ వుంటాను. ఇక అన్నమాచార్యుల కీర్తనలను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతుంటేనే అందం. ఆయనంత చిక్కగా చక్కగా పాడేవారు అరుదు. ఇక కన్నడంలో లక్షా నలుబదివేల కీర్తనలను రచించిన పురందర దాసు కీర్తనలను, కన్నడ గాయకులు ( పేర్లు తెలియవు) పాడినవి విన్నాను . అద్భుతం .మీకు తెలిసినవి నాతొ పంచుకోగలరు. సంగీతమే కాక ప్రాత తెలుగు పిక్చర్స్ (79 లోపువి) ఇష్టం.హిందీ పిక్చర్స్ కూడా.
ముఖ్యంగా వాటిలోని మ్యూజిక్ చాల ఇష్టం .తరువాత జ్యోతిషం కూడా చూస్తూ వుంటాను . కామెడీ ఇష్టం . వీటిని నలుగురితోను పంచు కోవాలి అనుకుంటున్నాను . సోది అనుకోవద్దు .ప్లీజ్. తోచినవి వ్రాస్తూంటాను.చదువుతారుకదా!

3 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

$నాగస్వరం గారు
ము౦దుగా బ్లాగ్లోకానికి స్వాగతం.

#నాకు సంగీతమంటే ప్రాణం
ఆహా..మీది, నాది ఒకే అభిరుచి..అదీ ప్రాణమంత:). నాకూ సంగీతం అంటే ఆరోప్రాణం. నా పంచప్రాణాలు సప్తస్వరాలమయం. అమృతమయమైన మన భారతీయసంగీతం గురించి మీ దగ్గర అమూల్యమైన విశేషసమాచారం ఉన్నట్లుంది. ఇక్కడ చక్కగా మాతో పంచుకోగలరని ఆశిస్తున్నా.

మీకు వీలున్నపుడు కింద గొలుసు చూసి మీ అభిప్రాయాన్ని పంచుకోగలరు.

http://saapaatusamagatulu.blogspot.com/2011/05/blog-post.html

.....

ఒక విన్నపం: బ్లాగు మొదలు పెట్టినప్పుడు వచ్చే పదనిశ్చయం(వర్డ్ వెరిఫికేషన్) అలానే ఉంది. దాన్ని తీసివేయగలరు. :)

సుజాత వేల్పూరి చెప్పారు...

మీకు సంగీతం ఇష్టమని మీ బ్లాగు పేరుతోనే చెప్పారన్నమాట. సంగీతాన్ని అభిమానించేవారు, పంచుకునే వారు తెలుగు బ్లాగర్లలో చాలామందే ఉన్నారు. మీరు కూడా మీకు నచ్చిన సంగీతన్ని ఇక్కడ పంచుకుంటే మేము కూడా ఆనందిస్తాం!

Nanduri చెప్పారు...

Sir, I like your interest in jyotishyam.Please make research on it and I wish you should become an expert in jyotishyam. I also wanted to know my future with the help of your Jyotishyam.
Your blog is excellent. It is so many times better than what I expected. Please try to be posting more and more to educate the people like me.