19, మే 2011, గురువారం

కళ్లు తెరువరా ! .....

గోవిందం భజ - 6


యావ త్పవనో నివసతి దేహే

తావ త్పృచ్ఛతి కుశలం గేహే,

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మి న్కాయే. 5



" ఎంతవరకు ప్రాణవాయువు శరీరమందుంటుందో,

అంతవరకు ఇంట్లో జనం కుశలం అడుగుతూంటారు.

ప్రాణం పోయి, దేహానికి అపాయం కలుగగానే,

ఆ శరీరం అంటే అంతకుముందు ఎంతో ప్రీతి కల పెండ్లాం కూడా భయపడుతుంది."




నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-




ఎలాంటివారికైనా సరే

ఒళ్లు జలదరిస్తుంది.

ఈ శ్లోకభావం అర్థం కాగానే.



ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకే

ఇంట్లో కుశలం అడిగేది.

అది కాస్తా ఎగిరిపోయాక,

కట్టుకొన్న ,

( బ్రతికి ఉండగా ) కావలసినప్పుడల్లా ఒంటికి చుట్టుకొని, ముద్దులాడిన

( ఆ వ్యక్తి )భార్యకూడా, ప్రాణం లేని తన భర్త శరీరాన్ని చూడ్డానికే భయపడుతుంది.



ఇంత భయంకరంగా ఎందుకు చెప్పారంటే,

మరి అంతే తీవ్రంగా మమకారం మరుగుతోందిగా !

రోగాన్ని బట్టి మందు డోసు పెంచి ఇవ్వాలిగా !

తీవ్రమైన పనికిమాలిన వాంఛలతో

అల్లకల్లోలమైన సంద్రంలా ఉన్న మనసును

ఇలాంటి తత్త్వబోధలే ప్రశాంతపరుస్తాయి.

మనసును అదుపులో ఉంచుతాయి. కళ్లెం వేస్తాయి. వెనక్కు లాగుతాయి.

మనసు గురించి ముందు చెప్పుకొన్నాం కోతి లాంటిదని.

కోతి, శాఖాచంక్రమణం చేసినట్లుగా మనసు కూడా పరిపరివిధాల పరుగెత్తుతూంటుంది.

పట్టపగ్గాల్లేకుండా పరుగెడుతున్నప్పుడు, ( అధర్మంగా )

ఇలాంటి వేదాంతబోధలు అడ్డుకట్టల్లా మారి, ధర్మంవైపు త్రిప్పుతాయి.

చాలు. ఇంకొద్దు. ఈ పాట వినండి.






ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

As long as there dwells breath in the body,
so long they enquire of your welfare at home.
Once the breath leaves, the body decays,
even the wife fears that very same body.


శుభం భూయాత్

2 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

$నాగస్వరం గారు

భజగోవిందం చెప్పిన జీవితసత్యాన్ని చక్కగా వివరించారు. టపా ఒక ఎత్తైతే మీరు పెట్టిన ఆ పాట మరో ఎత్తు. గుండెల్లోకి హత్తుకుపోయేంత హృద్యంగా పాడుతున్నారు. ఎవరండీ గాయకుడు గారు?

నాగస్వరం చెప్పారు...

నాగస్వరంలో భజగోవిందం టపాలు మీకు నచ్చినందుకు సంతోషం. కృతజ్ఞతలు.

ఆ గాయకుని పేరు పువ్వుల సూరిబాబు.

ఆయనను అందరూ కంచుకంఠం సూరిబాబు అనేవారు.

ఆయన పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ లో దొరుకుతాయి.

http://en.wikipedia.org/wiki/Puvvula_Suri_Babu